IPL 2025: కేకేఆర్ సంచలనం.. కెప్టెన్‌తో పాటు 24 కోట్ల ప్లేయర్‌ను వదిలించుకుందిగా.. రిటైన్ లిస్టు ఇదిగో

|

Oct 31, 2024 | 7:33 PM

డిపెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటెన్షన్ లిస్ట్ నుంచి తొలగించింది. అదే సమయంలో ఊహించని ఆటగాళ్లను అంటి పెట్టుకుని మరో షాక్ ఇచ్చింది.

IPL 2025: కేకేఆర్ సంచలనం.. కెప్టెన్‌తో పాటు 24 కోట్ల ప్లేయర్‌ను వదిలించుకుందిగా.. రిటైన్ లిస్టు ఇదిగో
Kolkata Knight Riders
Follow us on

IPL 2025 టోర్నమెంట్‌కు ముందు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది. ఏ ఆటగాళ్లను రిటైన్ చేయాలి, ఎవరిని విడుదల చేయాలి అనే ప్రశ్న తరచుగా అడిగేది. ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఎందుకంటే మొత్తం పది ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న అలాగే విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఈ ప్రక్రియలో గత ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. రిటెన్షన్ లిస్ట్ నుంచి గతేడాది జట్టును చాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించింది. ఇక KKR రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ ఉన్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ మూడుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో రెండుసార్లు, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఒకసారి టైటిల్ గెలుచుకుంది. అయితే గత కొద్ది రోజులుగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. గౌతమ్ గంభీర్ కోచ్ పదవిని వదిలి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. సిబ్బందిలోనూ మార్పు వచ్చింది ఇప్పుడు కోల్ కతా ఫ్రాంచైజీ శ్రేయాస్ అయ్యర్‌ను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

 

గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.24.75 కోట్లు ఆఫర్ చేసి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను విడుదల చేయాలని KKR నిర్ణయించింది. తద్వారా ఐపీఎల్ మెగా వేలంలో స్టార్క్ కూడా కనిపించనున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..