IPL 2025: గుజరాత్‌తో ఢిల్లీ, రాజస్తాన్‌తో లక్నో.. పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసే మ్యాచ్‌లివే భయ్యో..

GT vs DC and RR vs LSG Preview: ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, గుజరాత్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ ఢిల్లీ జట్టు గుజరాత్ కంటే కొంచెం ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెండవ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌ను సొంత మైదానంలో ఆడనుంది. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రాజస్తాన్ రాయల్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

IPL 2025: గుజరాత్‌తో ఢిల్లీ, రాజస్తాన్‌తో లక్నో.. పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసే మ్యాచ్‌లివే భయ్యో..
Gt Vs Dc And Rr Vs Lsg

Updated on: Apr 19, 2025 | 8:54 AM

GT vs DC and RR vs LSG Preview: ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 18 శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఇక రెండవ మ్యాచ్ జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లలో ఏ జట్టు బలాలు, ప్లేయింగ్ 11 ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు రెండు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లు ఇప్పటికే తలో 6 మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ జట్టు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో, గుజరాత్ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. రెండు జట్లలోనూ చాలా మంది దిగ్గజాలు ఉన్నారు. రెండు జట్ల మధ్య జరిగిన హెడ్ టు హెడ్ గణాంకాలను ఓసారి చూద్దాం..

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గణాంకాలు..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, గుజరాత్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ ఢిల్లీ జట్టు గుజరాత్ కంటే కొంచెం ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

రెండవ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌ను సొంత మైదానంలో ఆడనుంది. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రాజస్తాన్ రాయల్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి జట్టు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటుంది. కాగా లక్నో తన చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఇరుజట్లు తిరిగి రావాలని కోరుకుంటున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గణాంకాలు..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌లలో, రాజస్థాన్ రాయల్స్ ఆధిక్యంలో నిలిచింది. రెండు జట్లు ఒకదానితో ఒకటి మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాయి. అందులో రాజస్థాన్ జట్టు 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. లక్నో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది.

గెలుపు ఎవరిది?

ఢిల్లీ, గుజరాత్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీదే పైచేయిగా ఉంటుంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఢిల్లీ ఆటగాళ్లలో ఎక్కువ మంది అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నారు.

కాగా, రెండవ మ్యాచ్‌లో లక్నో జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..