ఇండియన్ ప్రీమియర్ లీగ్ 6వ మ్యాచ్ సందర్భంగా ప్రమఖ కామెంటేటర్ మురళీ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఆర్సీబీకి చెందిన ఓ ఆటగాడిని చెత్తతో పోల్చడంపై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక్ వ్యాఖ్యలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్ లో RCB బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసినా పవర్‌ప్లేలో సరిగా ఆడలేకపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్ కకట్టుదిట్టంగా బంతులేశాడు. అతను తొలి రెండు ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సమయంలో కామెంటేటర్ గా ఉన్న మురళీ కార్తీక్ నోరు జారాడు. ‘ఒకరు వదిలేసిన చెత్త.. మరొకరికి విలువైన ఖజానా’’.. అంటూ యశ్ దయాల్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో యష్ దయాల్ బౌలింగ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు దీనిని పరోక్షంగా గుర్తు చేస్తూ యశ్ ను వెక్కిరించాడు మురళీ కార్తీక్. ఈ ప్రకటన తర్వాత పలువురు సోషల్ మీడియాలో మురళీ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాఖ్యాత హోదాలో ఇలాంటి చిన్నపిల్లాడి ప్రకటనలు చేయడం అభ్యంతరకరం కాదా అని కొందరు ప్రశ్నించారు. ఇక ఆర్సీబీ కూడా ‘అవును.. మాకు అతనొక విలువైన ఖజానా’ అంటూ యశ్ దయాలన్ ను ప్రశంసిస్తూనే మురళీ కార్తిక్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు కార్తీక్ ఎలాంటి విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి, గెలుపు రుచి చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం మూడో మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది.
He’s treasure. Period. ❤🔥 pic.twitter.com/PaLI8Bw88g
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 25, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..