సోమవారం (ఏప్రిల్ 08) రాత్రి జరిగిన ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది . చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎప్పటిలాగే చెన్నై అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ‘ధోనీ.. ధోనీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, కేకేలు వేశారు. కాసేపు ధోని నామస్మరణతో చిదంబరం స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ రీసౌండ్ కు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మొదట, శివమ్ దూబే వికెట్ పడినప్పుడు ఎంఎస్ ధోని మైదానంలోకి రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు నటిస్తూ అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జడేజా టీజింగ్‌కి ప్రేక్షకులు ఒక్క క్షణం షాక్‌కు గురైతే, ధోనీ మాత్రం తన అలవాటైన స్టైల్‌లో గ్లోవ్స్‌ని సరిచేసుకుంటూ మైదానంలోకి ఎంటర్ అయ్యాడు.
అదే సమయంలో ఎంఏ చిదంబరం స్టేడియంలో అభిమానులందరూ ఏకధాటిగా ‘ధోనీ… ధోనీ..’ అంటూ కేకలు వేయడం ప్రారంభించారు. అభిమానుల నినాదాల దెబ్బకు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రస్సెల్ కాసేపు చెవులు మూసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. KKR తరపున శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు, నరైన్ 27 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు పూర్తిగా నిరాశపర్చారు.
Andre Russell closed his ears upon the Arrival of MS Dhoni 🔥
The Craze of #ThalaDhoni 🫡💫#MSDhoni #AndreRussell #CSKvKKR pic.twitter.com/0I8b81Hurt
— Rajat Agrawal (@rajatag16) April 9, 2024
ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని చివరి దశలో క్రీజీలోకి వచ్చి అభిమానులను ఉర్రూతలూగించాడు. ధోనీ 3 బంతుల్లో 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
As if you’re reading the caption right now 😏#CSKvKKR #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/CkBRJxqLUt
— JioCinema (@JioCinema) April 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.