IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీస్తాడనుకుంటే.. ఒకే ఓవర్‌తో ఐపీఎల్‌లో చెత్త రికార్డ్.. తలపట్టుకున్న కేఎల్

|

Apr 08, 2024 | 4:14 PM

IPL 2024: IPL 2024 21వ మ్యాచ్‌లో లక్నో తరపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచిన మణిమారన్ సిద్ధార్థ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. పవర్‌ప్లేలో తొలి రెండు ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వని సిద్ధార్థ్ మూడో ఓవర్‌లో కాస్త కాస్ట్లీగా మారాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులిచ్చి మూడు నో బాల్‌లు వేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ విషయంలో సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, అనిల్ కుంబ్లే, యోగేష్ నగర్‌లను అధిగమించాడు.

IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీస్తాడనుకుంటే.. ఒకే ఓవర్‌తో ఐపీఎల్‌లో చెత్త రికార్డ్.. తలపట్టుకున్న కేఎల్
Manimaran Siddharth
Follow us on

ఆదివారం గుజరాత్, లక్నో (GT vs LSG) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) నేతృత్వంలోని లక్నో జట్టు 33 పరుగుల తేడాతో సులువైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా గుజరాత్‌ కేవలం 130 పరుగులకే ఆలౌటైంది. లక్నో విజయంలో జట్టు బౌలింగ్ విభాగం సహకారం ఎంతో ఉంది. లక్నో పేసర్లు ఆరంభం నుంచే గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 5 వికెట్లు తీసిన యశ్ ఠాకూర్ విజేతగా నిలిచాడు. అయితే, లక్నో స్పిన్నర్ మణిమారన్ సిద్ధార్థ్ (Manimaran Siddharth) ఒకే ఓవర్‌లో మూడు నో బాల్‌లు వేసి అవాంఛిత రికార్డు సృష్టించాడు.

IPL 2024 21వ మ్యాచ్‌లో లక్నో తరపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచిన మణిమారన్ సిద్ధార్థ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. పవర్‌ప్లేలో తొలి రెండు ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వని సిద్ధార్థ్ మూడో ఓవర్‌లో కాస్త కాస్ట్లీగా మారాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులిచ్చి మూడు నో బాల్‌లు వేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ విషయంలో సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, అనిల్ కుంబ్లే, యోగేష్ నగర్‌లను అధిగమించాడు.

ఒకే ఓవర్‌లో ఎక్కువ నో బాల్‌లు వేసిన బౌలర్లు..

3 నో బాల్స్- మణిమారన్ సిద్ధార్థ

ఇవి కూడా చదవండి

2 నో బాల్స్- అమిత్ మిశ్రా 2009 IPL

2 నో బాల్స్- అనిల్ కుంబ్లే 2010 IPL

2 నో బాల్స్- యోగేష్ నగర్ 2011 IPL

2 నో బాల్స్- అమిత్ మిశ్రా 2016 IPL

బ్రిలియంట్ యశ్ ఠాకూర్..

ఒకవైపు మణిమారన్ సిద్ధార్థ ఒకే ఓవర్‌లో మూడు నో బాల్‌లు వేసి అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకోగా, మరోవైపు స్పీడ్‌స్టర్ యశ్ ఠాకూర్ 5 వికెట్ల హాల్‌తో ఆకట్టుకున్నాడు. 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుత సీజన్‌లో ఓ బౌలర్ ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానంలో..

ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, గుజరాత్ టైటాన్స్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. లక్నో సీజన్‌ను శుభారంభం చేసింది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..