అప్పుడు RCBకి.. ఇప్పుడు హైదరాబాద్‌కు.. ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?

|

Mar 28, 2024 | 5:35 PM

11 ఏళ్ల క్రితం, 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై ఆర్సీబీ 263 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ రికార్డును సుమారు దశాబ్దం తర్వాత చెరిపేయడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.

అప్పుడు RCBకి.. ఇప్పుడు హైదరాబాద్‌కు.. ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
IPL 2024
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసి 11 ఏళ్ల నాటి రికార్డును చెరిపేసింది. 11 ఏళ్ల క్రితం, 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై ఆర్సీబీ 263 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ రికార్డును సుమారు దశాబ్దం తర్వాత చెరిపేయడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. విశేషమేమిటంటే.. ఈ రెండు రికార్డు మ్యాచ్ ల్లోనూ ఆడి జయదేవ్ ఉనద్కత్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంటే, 2013లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 పరుగులు చేసినప్పుడు, జయదేవ్ RCB ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యాడు. ఇప్పుడు 2024లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగుల CDCతో కొత్త చరిత్ర సృష్టించినప్పుడు కూడా SRH జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో జయదేవ్ ఉనద్కత్ కనిపించాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయడం వివేషం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రెండు అత్యధిక స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జయదేవ్ ఉనద్కత్ స్పెషల్ రికార్డు కైవసం చేసుకున్నాడు.

ఇవి కూడా..

ఇదే కాదు ఐపీఎల్ లో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనాద్కత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. జయదేవ్ ఇప్పటివరకు 8 ఐపీఎల్ టీమ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. కేకేఆర్, ఢిల్లీ, ఆర్సీబీ, ఫుణె, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు జయదేవ్. తద్వారా గతంలో 7 జట్లకు ప్రాతినిథ్యం వహించిన మనీశ్ పాండే రికార్డును బద్దలు కొట్టాడీ ఫాస్ట్ బౌలర్.

ఇవి కూడా చదవండి

 

జయ్ దేవ్ ఉనాద్కత్ పేరిట ప్రత్యేక రికార్డు..

రెండు మ్యాచుల్లోనూ రెండేసి వికెట్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..