Gujarat Titans vs Delhi Capitals, 32nd Match Preview: ఐపీఎల్ 2024 (IPL 2024) 32వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏప్రిల్ 17 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తమ మునుపటి మ్యాచ్‌ల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్‌లను ఓడించాయి. పాయింట్ల పట్టికలో టైటాన్స్ 3 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరుజట్ల కెప్టెన్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ తమ జట్టు విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్నారు.
IPL చరిత్రలో, గుజరాత్, ఢిల్లీ ఇప్పటి వరకు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో టైటాన్స్ రెండుసార్లు గెలుపొందగా, ఢిల్లీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య కేవలం 1 మ్యాచ్ మాత్రమే జరగగా, ఢిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్, జట్టును చూస్తుంటే ఢిల్లీతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌దే పైచేయి కనిపిస్తోంది.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం పిచ్‌పై బౌలింగ్, బ్యాటింగ్‌తో సమానమైన ఆట కనిపిస్తుంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170గా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ రెండింట్లో విజయం సాధించగా, ఆతిథ్య జట్టు పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వాతావరణం గురించి చెప్పాలంటే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 30 నుంచి 36 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..