
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఆర్సీబీకి ఇది ఏడో మ్యాచ్ కాగా, హైదరాబాద్‌కు ఆరో మ్యాచ్. హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. RCB 6 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో అంటే పదో స్థానంలో ఉంది. ఇప్పుడు టోర్నీలో నిలవాలంటే RCB మిగిలిన మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సి ఉంది.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమరోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టి నటరాజన్.
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..