IPL 2023: ‘హైదరాబాదీ’ ధాటికి పేకమేడలా కూలిన పంజాబ్ టీమ్.. ఆర్‌సీబీ ఖాతాలో మూడో విజయం..

|

Apr 20, 2023 | 7:58 PM

IPL 2023, PBKS vs RCB: మొహాలీలో ఆర్‌సీబీ టీమ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 150 పరుగులకే..

IPL 2023: ‘హైదరాబాదీ’ ధాటికి పేకమేడలా కూలిన పంజాబ్ టీమ్.. ఆర్‌సీబీ ఖాతాలో మూడో విజయం..
Rcb Vs Pbks Ipl 2023
Follow us on

IPL 2023, PBKS vs RCB: మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టీమ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 150 పరుగులకే కుప్పకూలారు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బెంగళూరు ఆటగాళ్లైన ఫాఫ్ డూ ప్లెసీస్(84), విరాట్ కోహ్లీ(59) పరుగులతో ఈ మ్యాచ్‌లోనే టాప్ స్కోరర్లుగా నిలిచారు. సామ్ కర్రన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలుత టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ తరఫున బ్యాటింగ్‌కి వచ్చిన ఫాఫ్ డూ ప్లెసీస్, విరాట్ కోహ్లీ అర్థ శతకాలతో చెరరేగడమే కాక తొలి వికెట్‌కి 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

అయితే హర్‌ప్రీత్‌బ్రార్ వేసిన విరాట్ కోహ్లీ, అనంతరం వచ్చిన మాక్స్‌వెల్(0) వెనుదిరిగారు. ఆ క్రమంలో దినేశ్ కార్తీక్ (7), లూమర్ (7 నాటౌట్), షబాజ్ అహ్మద్ (5 నాటౌట్) తమ వంతుగా మరికొన్ని పరుగులు సాధించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్‌బ్రార్ 2, అర్షదీప్ సింగ్ 1, నాథన్ ఎల్లిస్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి


అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ వరుస వికట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46), జితేష్ శర్మ(41) మాత్రమే రాణించారు.  మిగిలినవారిలో చాలా మంది రెండంకెల స్కోర్ దాటేవరకు కూడా క్రీజులో నిలవలేకపోయారు. దీంతో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులు వద్ద ఆలౌట్ అయింది. మరోవైపు బెంగళూరు తరఫున మహమ్మద్ సిరాజ్ 4 వికట్లతో చెలరేగాడు. అలాగే హసరంగా 2.. వెయినే పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..