IPL 2023: మైదానంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోని, కోహ్లీలను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌.. వైరల్‌ వీడియో

|

Apr 18, 2023 | 8:01 AM

మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరిని గురుశిష్యులు అని ముద్దుగా పిల్చుకుంటారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. తాజాగా ధోని- కోహ్లీల స్నేహబంధానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదికగా నిలిచింది

IPL 2023: మైదానంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోని, కోహ్లీలను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌.. వైరల్‌ వీడియో
Virat Kohli, Ms Dhoni
Follow us on

మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరిని గురుశిష్యులు అని ముద్దుగా పిల్చుకుంటారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. తాజాగా ధోని- కోహ్లీల స్నేహబంధానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ స్వయంగా వెళ్లి ధోనిని హత్తుకుని మాటలు కలిపాడు. ఆతర్వాత ఇద్దరూ కలిసి ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ధోని ఏం చెప్పాడో తెలియదు కానీ విరాట్‌ ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ధోని- కోహ్లీ ముచ్చట్లకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలైంది. అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సీజన్‌లో బెంగళూరు, చెన్నై ఒకసారి మాత్రమే తలపడనున్నాయి. దీనికి తోడు ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ధోని– విరాట్‌ కలిసి ఆడిన ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఇదేనేమోనని సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో #MAHIRAT అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్‌ దుబే(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఆఖరి ఓవర్‌లో19 పరుగులు అవసరం కాగా..10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 8 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(62), మాక్స్‌వెల్‌(76) అద్భుతంగ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..