IPL Trophy 2023: ఐపీఎల్ ట్రోఫీపై 4 సంస్కృత పదాలు.. అర్థం ఏమిటో తెలుసా..? అదే టోర్నీ నినాదం కూడా..

IPL Trophy 2023: ఐపీఎల్ 16వ సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఆహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్...

IPL Trophy 2023: ఐపీఎల్ ట్రోఫీపై 4 సంస్కృత పదాలు.. అర్థం ఏమిటో తెలుసా..? అదే టోర్నీ నినాదం కూడా..
Sanskrit Words On IPL Trophy

Updated on: May 28, 2023 | 1:34 PM

IPL Trophy 2023: ఐపీఎల్ 16వ సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఆహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌ చెన్నై గెలిస్తే ధోని ఖాతాలోకి 5వ ట్రోఫీ, లేదా గుజరాత్ టీమ్ గెలిస్తే వాళ్ల వద్దే ట్రోఫీ రెండో సారి కూడా ఉంటుంది.  ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్స్‌లో ఐపీఎల్ ట్రోఫీ కూడా ఒకటి, దీన్ని గెలవడం అంత సులభం కాదు. ప్రత్యర్థి జట్లను ఓడించి శిఖరాగ్ర స్థాయికి చేరితే కాని ట్రోఫీ సొంతం కాదు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఐపీఎల్ ట్రోఫీపై ఓ అందమైన డిజైన్‌ ఉంది. అది సంస్కృతంలో ఉండడమే కాక ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కలిగి ఉంది. ప్రతి ఏటా టోర్నీ విజేత గెలుచుకునే ఐపీఎల్ ట్రోఫీపై ‘‘యత్ర ప్రతిభా అవ్సర ప్రాప్నోతిహి(Yatra Pratibha Avsara Prapnotihi)’’ అనే సందేశం చెక్కబడి ఉంది. సంస్కృత భాషలో ఉన్న ఈ పదాలకు ‘ప్రతిభకు అవకాశం ఉన్నచోటు’ అని అర్థం.

కాగా, నేడు తపపడబోతున్న చెన్నై, గుజరాత్ జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో 4 సార్లు పోటీ పడ్డాయి. అందులో చెన్నై ఒక మ్యాచ్ మాత్రమే గెలవగా.. మిగిలిన మూడింటిలో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అలాగే అరంగేట్రం చేసిన సంవత్సరమే టైటిల్ కొట్టిన గుజరాత్.. రెండో ఏట కూడా ఫైనల్‌కి చేరి కప్ కోసం తహతహలాడుతోంది. ఇంకా చెన్నై కూడా ఆడిన 14 సీజన్లలోనే 12 సార్లు ప్లేఆఫ్స్ ఆడి.. తాజాగా 10వ సారి ఫైనల్ మ్యాచ్‌ ఆడుతోంది. మరి నేటి మ్యాచ్‌లో చెన్నై ఖాతాలో 5వ ట్రోఫీ పడుతుందో.. గుజరాత్ చేతిలోనే మరో ఏడాది ఐపీఎల్ కప్ నిలుస్తుందో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..