ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ అంటే IPL 2023 పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఐపీఎల్ 16వ సీజన్ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. అంటే, ఈ ఏడాది మినీ వేలం జరగనుంది. దీనికి ముందు, లీగ్ ప్రారంభానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. నివేదిక ప్రకారం, IPL 2023 ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమవుతుంది. నిజానికి మహిళల ఐపీఎల్ కారణంగా ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ ప్రారంభంకానుంది. బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి వస్తున్న నివేదికల ప్రకారం, మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్ మార్చి 3 నుంచి ప్రారంభమై మార్చి 26 వరకు కొనసాగుతుందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తన నివేదికలలో తెలిపింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్ 7-8 రోజుల ఆలస్యంతో ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2023 కోసం నిర్వహించనున్న మినీ వేలంలో మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 714 మంది భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ విదేశీ ఆటగాళ్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా నుంచే ఉన్నారు. అంటే ఈ దేశం నుంచి 57 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 52 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. ఈ ఆటగాళ్లలో మొత్తం 185 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 786 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరుగుతుంది.
మినీ వేలంలో మొత్తం 21 మంది ప్లేయర్లు తమ ధరను రూ. 2 కోట్లుగా ప్రకటించారు. ఈ స్టార్ ప్లేయర్లలో కేన్ విలియమ్సన్, బెన్ స్టోక్స్, నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్‌టన్, క్రెయిగ్ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, రిలే రోసౌ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..