IPL 2023, MI vs RR: ‘అతని ఆట అద్భుతం, భారత్‌కు చాలా మంచిది’.. జైస్వాల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

May 01, 2023 | 1:06 PM

IPL 2023, MI vs RR: ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌ ముంబై ఇండియన్స్ 6 వికెట్ తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ టీమ్ తరఫున యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్..

IPL 2023, MI vs RR: ‘అతని ఆట అద్భుతం, భారత్‌కు చాలా మంచిది’..  జైస్వాల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohit Sharma On Yashaswi Jaiswal
Follow us on

IPL 2023, MI vs RR: ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌ ముంబై ఇండియన్స్ 6 వికెట్ తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ టీమ్ తరఫున యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(124) చేసిన మెరుపు సెంచరీ వృధా అవుతుందని కూడా అనుకోని ఉండరు. అయితే ముంబై బ్యాటర్లు ఆ భారీ స్కోరును కూడా అవలీలగా ఊదేశారు. అంతేనా.. టిమ్ డేవిడ్ అయితే చివరి ఓవర్లో హ్యట్రిక్ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘ఇంత భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చివరి మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు ఛేజ్ చేసే వరకు వచ్చి కూడా చివర్లో తడబడ్డాం. ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాటు చేయకుండా గెలవడం సంతోషంగా ఉంది. పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. కానీ టిమ్ డేవిడ్‌కు ఆ సత్తా ఉంద’ని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి కూడా రోహిత్ శర్మ మాట్లాడాడు. ‘రాజస్థాన్ తరఫున జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ప్రదర్శన గతే సీజన్‌లోనే చూశా. ఈసారి తన ప్రదర్శనను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. అతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందని జైస్వాల్‌ని అడిగితే అతను జిమ్‌కు వెళ్తున్నా అని చెప్పాడు. ఇలా ఆడడం అతని కెరీర్‌కి, టీమిండియాకు, ఆర్ఆర్‌కు అందరికీ మంచిదే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి


కాగా, ఆదివారం మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్  62 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 16 ఫోర్లతో 124 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఇక 2020 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరంగేట్రం చేసిన జైస్వాల్ అప్పటి నుంచి ఆ టీమ్‌కే ఆడుతున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ మొత్తం 975 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..