Rishabh Pant: ఢిల్లీ డగౌట్‌లో రిషబ్ పంత్.. భావోద్వేగానికి గురైన అభిమానులు.. అసలు విషయం ఏంటంటే?

|

Apr 01, 2023 | 9:22 PM

LSG Vs DC, IPL 2023: గాయం కారణంగా రిషబ్ పంత్ IPL 2023లో భాగం కాలేదు. అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఢిల్లీ తొలి మ్యాచ్‌ లక్నో సూపర్‌ జెయింట్‌తో తలపడుతోంది.

Rishabh Pant: ఢిల్లీ డగౌట్‌లో రిషబ్ పంత్.. భావోద్వేగానికి గురైన అభిమానులు.. అసలు విషయం ఏంటంటే?
Rishabh Pant
Follow us on

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ప్రారంభమైంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని జట్టు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క రిషబ్ పంత్ తప్ప.. దాదాపు ఢిల్లీ ఆటగాళ్లందరూ హాజరయ్యారు. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ పంత్ ప్రమాదం కారణంగా ఈ సీజన్‌లో ఆడడం లేదు. ఇటువంటి పరిస్థితిలో అతను లేకుండా ఢిల్లీ మైదానంలోకి దిగవలసి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితిలోనూ రిషబ్ పంత్ సందడి ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో కనిపించింది. దీంతో అభిమానులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓ ఫొటోను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

తమ కెప్టెన్ లేకుండా ఈ సీజన్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్, ఓనర్లు, ఆటగాళ్లు, అభిమానులు సీజన్ ప్రారంభానికి ముందే రిషబ్ పంత్‌ను కోల్పోయామంటూ బాధపడ్డారు. పంత్‌ను స్టేడియంకు రప్పించేందుకు ప్రయత్నిస్తామని, తద్వారా అభిమానులు, జట్టులో నైతిక స్థైర్యాన్ని పెంచుతామని ఢిల్లీ అధికారులు తెలిపారు. అనుకున్న ప్రకారమే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కొంతమేర విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ డగౌట్‌లో రిషబ్ పంత్..


ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ చేస్తున్న లక్నో స్టేడియంలో డేవిడ్ వార్నర్ తన బౌలర్లను, ఫీల్డర్లను మైదానంలో పరుగులు పెట్టిస్తున్నాడు. అదే సమయంలో, కోచ్ రికీ పాంటింగ్, సహాయక సిబ్బంది, అదనపు ఆటగాళ్లు అంతా బౌండరీకి సమీపంలో ఉన్న ఢిల్లీ డగౌట్‌లో కూర్చున్నారు. ఇక్కడ రిషబ్ కూడా కనిపించాడు.

తమ స్టార్ ప్లేయర్‌కు మద్దతు తెలిపేందుకు, ఢిల్లీ డగౌట్‌లో రిషబ్ నంబర్ 17 నంబర్ జెర్సీని వేలాడదీసింది. ఈ మేరకు ఢిల్లీ “ఎల్లప్పుడూ మా డగౌట్‌లో. ఎప్పుడూ మా టీమ్‌లోనే’ అంటూ క్యాఫ్షన్ అందించింది. దీంతో ఈ పొటో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మిస్ యూ బ్రదర్ అంటూ కొతమంది, ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంత్ వచ్చాడంలూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..