ఐపీఎల్ 2023కి ముందుగానే ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మినీ వేలానికి బీసీసీఐ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా ఆక్షన్ జరగనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము రిలీజ్ చేయాలనుకున్న ప్లేయర్స్ జాబితాను ప్రకటించాలని బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఫ్రాంచైజీలు వదిలేసుకుంటున్న ప్లేయర్స్ లిస్టును ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. తాము రిలీజ్ చేసే ప్లేయర్స్ జాబితాను బీసీసీఐకి సమర్పించింది. 2010 నుంచి ముంబై తరపున ఆడుతున్న కీరన్ పొలార్డ్.. అలాగే ఫ్యాబ్ అలెన్, టై మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షౌకిన్‌ను యాజమాన్యం రిలీజ్ చేసినట్లు సమాచారం. మొత్తం 10 మంది ప్లేయర్స్‌ను ముంబై రిటైన్ చేసుకోగా.. 5గురి ఆటగాళ్ళను రిలీజ్ చేసింది.
ఫ్యాబ్ అలెన్, టై మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షౌకిన్, కీరన్ పొలార్డ్
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్, బ్రెవిస్, స్టబ్స్, సామ్స్, తిలక్ వర్మ
కాగా, 2010 నుంచి ముంబై తరపున ఆడుతోన్న కీరన్ పొలార్డ్.. ఆ తర్వాత వచ్చిన సీజన్లలో జట్టులో కీలక ఆటగాడు అయిపోయాడు. అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. జట్టుకు కావాల్సినప్పుడల్లా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ప్రస్తుతం అతడు ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో.. యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని ఫ్యాన్స్ అంటున్నారు. అటు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ జాసన్ బెహన్‌డ్రూఫ్‌ను 75 లక్షలకు ట్రేడ్ చేసుకుంది ముంబై ఇండియన్స్. మరోవైపు గతేడాది ఐపీఎల్‌లో ముంబై 7 విజయాలు, 7 ఓటములతో 14 పాయింట్స్ సాధించి లీగ్ స్టేజిలో టోర్నీ నుంచి వెనుదిరిగిన సంగతి విదితమే.