ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్‌ది అగ్రస్థానం. రోహిత్ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే గత ఏడాది సీజన్‌లో మాత్రం రోహిత్ సేన పూర్తిగా చేతులెత్తేసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచింది.ఈనేపథ్యంలో రాబోయే సీజన్‌లో మెరుగ్గా రాణించాలని ముంబై పట్టుదలతో ఉంది. ఇందుకోసం జట్టులో భారీ మార్పులకు తెరతీసింది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2023 కోసం ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలించుకుంది. కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, టైమల్ మిల్స్ వంటి స్టార్ క్రికెటర్లకు కూడా షాక్ ఇచ్చింది. కాగా తమ ఆటగాళ్ల రిటైన్ లిస్టును బీసీసీఐకి అందజేయడానికి ముందు ముంబై ఇండియన్స్ మరో బిగ్ డెసిషన్ తీసుకుంది. తమ బౌలింగ్ ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి గతేడాది ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడిన ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్‌ను ట్రెడ్ చేసుకుంది. కాగా ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది.
Locked & loaded for #IPL2023 ??
ఇవి కూడా చదవండిPresenting our stars for the upcoming season ⭐?#OneFamily #MumbaiIndians pic.twitter.com/lyg8IOFwpT
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
రోహిత్ శర్మ (కెప్టెన్) , టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, బ్రూయిస్, ఆర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్.
Once a part of #OneFamily, always a part of #OneFamily ?#MumbaiIndians pic.twitter.com/4eTXunUyof
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
కీరన్ పొలార్డ్, రిలే మెరెడిత్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, టిమల్ మిల్స్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్, మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..