IPL 2023: లెక్క సరిచేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధం.. ‘గో గ్రీన్‌’ జెర్సీతో ఆర్‌సీబీ.. తుది జట్టు వివరాలివే..

IPL 2023, RCB vs RR: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోయే మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తలపడనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్‌ని..

IPL 2023: లెక్క సరిచేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధం.. ‘గో గ్రీన్‌’ జెర్సీతో ఆర్‌సీబీ.. తుది జట్టు వివరాలివే..
Rcb Vs Rr

Updated on: Apr 23, 2023 | 8:14 AM

IPL 2023, RCB vs RR: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోయే మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తలపడనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్‌ని సంజూ శామ్సన్ నడిపిస్తుండగా.. ఆర్‌సీబీని ఎవరు నడిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఆ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా తమ చివరి మ్యాచ్‌లో జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఫాఫ్ నడిపిస్తాడో.. లేదా విరాట్ మరోసారి నాయకత్వ పగ్గాలు అందుకుంటాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరోవైపు ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా, వాటిలో బెంగళూరుదే పైచేయి. ఈ 28 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో గెలవగా, రాజస్థాన్ 12 విజయాలు సాధించింది. మరో 3 మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచి, తమ ఖాతాలో కూడా 13వ విజయాన్ని వేసుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉండగా నేటి మ్యాచ్‌ కోసం RCB ఆటగాళ్లు ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు. చెట్లను రక్షించడం, పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ.

ఇవి కూడా చదవండి

తుది జట్ల ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు(అంచనా)

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వేన్ పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వైశాక్ విజయ్‌కుమార్, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..