IPL 2023: ‘ప్రేమంటే ఇదేరా’ హీరోయిన్‌ మంచి మనసు.. క్రికెటర్ల కోసం ఏకంగా 120 ఆలూ పరాఠాలు చేసిన ప్రీతీజింటా

|

Apr 30, 2023 | 7:29 PM

సాధారణంగా ఐపీఎల్‌ టీమ్స్‌ ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ప్రీతి మాత్రం తమ క్రికెరర్ల కోసం ఎవ్వరు చేయని పని చేసి తన మంచి మనసును చాటుకుంది. వివరాల్లోకి వెళితే.. 2009 లో కొన్ని కారణాలతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరిగిన సంగతి తెలిసిందే.

IPL 2023: ప్రేమంటే ఇదేరా హీరోయిన్‌ మంచి మనసు.. క్రికెటర్ల కోసం ఏకంగా 120 ఆలూ పరాఠాలు చేసిన ప్రీతీజింటా
Preity Zinta
Follow us on

ప్రీతీజింటా.. హిందీ సినిమాలు చూసే వారికి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేశ్‌ ప్రేమంటే ఇదేరా, మహేశ్‌బాబు రాజకుమారుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ అందాల తార. ముఖ్యంగా ప్రీతి సొట్టబుగ్గలకు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్రీతి ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తోంది. ఆ జట్టు మ్యాచ్‌ ఉన్నప్పుడల్లా స్టేడియానికి వచ్చి మరీ ఎంకరేజ్‌ చేస్తోంది. తాజా సీజన్‌లో కూడా స్టేడియాల్లో సందడి చేస్తోంది ప్రీతి. సాధారణంగా ఐపీఎల్‌ టీమ్స్‌ ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ప్రీతి మాత్రం తమ క్రికెరర్ల కోసం ఎవ్వరు చేయని పని చేసి తన మంచి మనసును చాటుకుంది. వివరాల్లోకి వెళితే.. 2009 లో కొన్ని కారణాలతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అక్కడ తమ క్రికెటర్లకి సరైన ఆహారం లేకపోవడంతో తమ ప్లేయర్ల కోసం స్వయంగా తానే 120 పరోటాలు చేసిందట ప్రీతి. ఇటీవల ఈ విషయాన్ని గుర్తుచేసుకుంది పంజాబ్‌ ఓనర్‌.

‘అబ్బాయిలు ఎంత తింటారనే విషయం మొదటిసారి అప్పుడే నాకు తెలిసింది. 2009లో దక్షిణాఫ్రికా వేదికగా ఐపీఎల్‌ టోర్నీ జరిగినప్పుడు క్రికెటర్ల కోసం మంచి ఫుడ్‌ పెడుతున్నట్లు నాకు అనిపించలేదు. దీంతో నేను చెఫ్‌ ల వద్దకు వెళ్లి ‘ మీకు పరాఠాలు ఎలా చేయాలో నేర్పుతా’ అని చెప్పా. అది చూసిన మా క్రికెటర్లు మీకు పరాఠాలు చేయడం వచ్చా అని నన్ను అడిగారు. దీంతో వచ్చే మ్యాచ్‌లో మీరు గెలిస్తే ఆలూ పరాఠాలు చేసి పెడతానన్నాను. అనుకున్నట్లే మా జట్టు విజయం సాధించింది. అలా మా క్రికెటర్ల కోసం 120 ఆలూప రాఠాలను తయారు చేశా’ అని అప్పటి సంగతులను గుర్తు తెచ్చుకుంది ప్రీతి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెల్చుకోలేదు పంజాబ్‌. తాజా సీజన్‌లోనూ మొత్తం 8 మ్యాచులు ఆడి 4 మ్యాచుల్లో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..