IPL 2023: గాయాలతో ఐపీఎల్‌కు దూరమైన స్టార్‌ క్రికెటర్లు వీరే.. ముంబై, ఢిల్లీలకు భారీ ఎదురు దెబ్బ

|

Mar 15, 2023 | 5:48 PM

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 31న ఈ ధనాధన్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది.

IPL 2023: గాయాలతో ఐపీఎల్‌కు దూరమైన స్టార్‌ క్రికెటర్లు వీరే.. ముంబై, ఢిల్లీలకు భారీ ఎదురు దెబ్బ
Ipl 2023
Follow us on

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 31న ఈ ధనాధన్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ ట్రోఫీని గెల్చుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. అందరి ఆటగాళ్లను ఒక చోటుకు చేర్చి ప్రాక్టీస్‌ చేయిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ సీజన్‌ ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తున్న కొద్దీ గాయపడ్డ స్టార్‌ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది ఆయా టీం మేనేజ్‌మెంట్లను తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా వెన్నునొప్పితో ఐపీఎల్‌కు దూరం కావొచ్చునని వార్తలు వస్తున్నాయి. అతను కాక ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ముగ్గురు ఆటగాళ్లు గాయపడి మెగా క్రికెట్‌ లీగ్‌కు దూరమయ్యారు. ఈసారి మొత్తం 10 మంది స్టార్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కనిపించకపోవచ్చు. వారెవరంటే?

1. శ్రేయాస్ అయ్యర్- కోల్‌కతా నైట్ రైడర్స్

ఇవి కూడా చదవండి

2. ప్రసిద్ధ్‌ కృష్ణ- రాజస్థాన్ రాయల్స్

3. జానీ బెయిర్‌స్టో- పంజాబ్ కింగ్స్

4.కైల్ జామిసన్- చెన్నై సూపర్ కింగ్స్

5. బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్

6. ఎన్రిచ్‌ నోకియా- ఢిల్లీ క్యాపిటల్స్‌

7. సర్ఫరాజ్ ఖాన్- ఢిల్లీ క్యాపిటల్స్

8. రిషబ్‌ పంత్- ఢిల్లీ క్యాపిటల్స్

9. జే రిచర్డ్‌సన్- ముంబై ఇండియన్స్

10. జస్ప్రీత్ బుమ్రా – ముంబై ఇండియన్స్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..