MS Dhoni Retirement: అభిమానులకు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే.. రిటైర్మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

May 30, 2023 | 11:01 AM

CSK vs GT Final IPL 2023: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. చెన్నై విజయానికి ముందు ధోనీ రిటైర్మెంట్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.

MS Dhoni Retirement: అభిమానులకు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే.. రిటైర్మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ms Dhoni Retirement
Follow us on

CSK vs GT Final IPL 2023, MS Dhoni Retirement: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. చెన్నై విజయానికి ముందు ధోనీ రిటైర్మెంట్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఛాంపియన్‌ అయిన తర్వాత రిటైర్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ప్రశ్నలకు ధోనీ సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ చేయండం లేదంటూ చెప్పుకొచ్చాడు. తదుపరి సీజన్‌లో పునరాగమనం గురించి కూడా సమాధానమిచ్చాడు.

ధోనీ రిటైర్మెంట్ ఊహాగానాలను కొట్టిపారేశాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూసి వారికి బహుమతి ఇచ్చేందుకు వచ్చే సీజన్‌లో మళ్లీ ఆడతానన్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ధోనీకి ఇదే చివరి సీజన్ అనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ధోనీ మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, నేను పదవీ విరమణ చేయడానికి ఇది సరైన సమయం. కానీ, చెన్నై అభిమానులు నాపై చూపించిన ప్రేమను తీరు, నేను మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నాను. వారికి ఇచ్చే బహుమతి ఇదే. వాళ్లు చూపించిన ప్రేమ, అభిమానం, నేను కూడా వాళ్ల కోసం ఏదైనా చేయాలి. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు నా శరీరం సహకరించాలి. కానీ, అభిమానుల కోసం మరో సీజన్ ఆడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రభావం పడింది. ఈ సీజన్ చివరి మ్యాచ్ ఆదివారం (మే 28) జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా ఒక రోజు పొడిగించారు. సోమవారం జరిగిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా దెబ్బతింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 214 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ నిబంధనతో చెన్నైకి లక్ష్యాన్ని అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..