KKR vs GT: బెడిసికొట్టిన కోల్‌కతా ప్రయోగం.. మోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. నిరాశగా వెనుదిరిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

|

Apr 29, 2023 | 7:04 PM

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌కు శార్దూల్‌ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ దక్కింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగాడీ పించ్‌ హిట్టర్‌. అయితే 4 బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. షమీ వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన శార్దూల్‌ మోహిత్‌ శర్మ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్‌ బాట పట్డాడు.

KKR vs GT: బెడిసికొట్టిన కోల్‌కతా ప్రయోగం.. మోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. నిరాశగా వెనుదిరిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌
Mohit Sharma
Follow us on

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్‌ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ధాటిగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (39 బంతుల్లో 81, 5ఫోర్లు, 7 సిక్స్‌లు) గుజరాత్‌ బౌలర్లను బెంబెలెత్తించాడు. మరో ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ 19 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కాగా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌కు శార్దూల్‌ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ దక్కింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగాడీ పించ్‌ హిట్టర్‌. అయితే 4 బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. షమీ వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన శార్దూల్‌ మోహిత్‌ శర్మ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్‌ బాట పట్డాడు. కాగా ఇక్కడ శార్దూల్ దురదృష్టం కంటే మోహిత్‌ క్యాచ్‌ ఎక్కువగా హైలెట్‌గా నిలిచింది. మిడాన్‌ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్‌ శరీరాన్ని గాల్లోకి డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో మోహిత్‌ ఎడమచేతి వేలికి గాయమైంది. అయినా ఐస్‌ ప్యాక్‌ పెట్టుకుని ఫీల్డింగ్‌ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన మోహిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..