వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ కైల్ మేయర్స్ అదరగొట్టాడు. తొలిసారిగా లక్నో తరఫున ఐపీఎల్ లీగ్ లోకి బరిలోకి అతను సునామీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను దంచికొడుతూ 38 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 192.11 కావడం విశేషం. కాగా లక్నోకు రెగ్యులర్ ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ ఉన్నాడు. అయితే అతను ఇప్పుడు నెదర్లాండ్స్ తో సిరీస్లో బిజీగా ఉన్నాడు. దీంతో మేయర్స్‌కు అనుకోకుండా ఓపెనర్‌గా అవకాశం దక్కించి. దీనిని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న అతను రెచ్చిపోయాడు. ఏకంగా డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ లిస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్ (158 నాటౌట్) తొలి స్థానంలో ఉండగా.. మైక్ హస్సీ (116) రెండో స్థానంలో, షాన్ మార్ష్ (84 నాటౌట్) మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్ మేయర్స్‌తో పాటు నికోలస్ పూరన్ (36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుష్ బదోని (18; 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడడంతో లక్నో భారీస్కోరు చేసింది. ఆతర్వాత 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. మార్క్‌వుడ్ (14/5) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఢిల్లీ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
A sneak peek of some brute force from Barbados ??
If you’re in Lucknow, watch your head!Watch #LSGvDC LIVE & FREE on #JioCinema across all telecom operators ?#IPL2023 #TATAIPL2023 #IPLonJioCinema pic.twitter.com/tQ2ekEF0lX
— JioCinema (@JioCinema) April 1, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..