DC vs RCB: బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ.. వార్నర్ సేన టార్గెట్ ఎంతంటే..?

|

May 06, 2023 | 10:11 PM

DC vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రెండో సార తలపడుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ బ్యాటర్లు విజృంభించారు. కింగ్ కోహ్లీ(55), మహిపాల్ లోమ్రోర్(54, నాటౌట్) అర్థ సెంచరీలతో  రాణించగా, ఫాఫ్ డుప్లెసిస్(45) కూడా పర్వాలేదనిపించాడు. ముందుగా టాస్..

DC vs RCB: బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ.. వార్నర్ సేన టార్గెట్ ఎంతంటే..?
Dc Vs Rcb
Follow us on

DC vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రెండో సార తలపడుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ బ్యాటర్లు విజృంభించారు. కింగ్ కోహ్లీ(55), మహిపాల్ లోమ్రోర్(54, నాటౌట్) అర్థ సెంచరీలతో  రాణించగా, ఫాఫ్ డుప్లెసిస్(45) కూడా పర్వాలేదనిపించాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్, డూప్లెసీస్ జోడీ అద్భుతంగా రాణించారు.

అయితే టీమ్ స్కోర్ 82 పరుగుల వద్ద ఔటైన కెప్టెన్ ఫాఫ్ 5 పరుగుల తేడాతో హఫ్ సెంచరీని మీస్ చేసుకున్నాడు. అనంతరం వచ్చిన మ్యాక్సీ(0) వెంటనే తిరిగినా ఆపై  మహిపాల్ లోమ్రోర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపాడు. 29 బంతులలోనే 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో కలిసి కొంత సేపు క్రీజులో ఉన్న కోహ్లీ 55 పరుగులతో పాటు ఐపీఎల్ క్రికెట్‌లో 7000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

అలాగే పెద్దగా ఫాంలో లేని దినేశ్ కార్తీక్(11) మరోసారి విఫలమైనా చివర్లో వచ్చిన అనుజ్ రావత్ అజేయంగా 8 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఇంకా 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 5 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 60 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..