Shubman Gill: మే 15న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ వెటరన్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక రికార్డును కూడా బద్దలు కొట్టాడు. గిల్ 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 101 పరుగులు చేశాడు. కాగా, ఎలాంటి సిక్స్ కొట్టకుండా కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో సిక్సర్ కొట్టకుండానే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. గిల్ కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది.
ఐపీఎల్ 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సచిన్ టెండూల్కర్, ఢిల్లీతో (2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఆడిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టకుండానే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తాజాగా ఈ రికార్డును గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ కైవసం చేసుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తరపున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో గిల్ 48 సగటుతో 146.19 స్ట్రైక్ రేట్‌తో 576 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీతో పాటు, 4 హాఫ్ సెంచరీలు కూడా వచ్చాయి.
ఐపీఎల్ 2023లో శుభ్‌మన్ గిల్ 500 పరుగుల మార్కును అధిగమించాడు. అయితే, గత సీజన్‌లో అంటే IPL 2022లో, గిల్ ఈ సంఖ్యను తాకలేకపోయాడు. IPL 2022లో, గిల్ 16 మ్యాచ్‌లలో 34.50 సగటు, 132.33 స్ట్రైక్ రేట్‌తో 483 పరుగులు చేశాడు. ఇందులో అతను నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో మొత్తం సీజన్‌లో అతని బ్యాట్ నుంచి మొత్తం 51 ఫోర్లు, 11 సిక్సర్లు వచ్చాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..