GT vs CSK Qualifier 1: తొలి క్వాలిఫైయర్‌లో ఈ ఐదుగురే ‘కీ’లకం.. లిస్టులో చివరి సీజన్ ఆడే ప్లేయర్?

|

May 23, 2023 | 3:14 PM

GT vs CSK Qualifier 1: ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శనపైనే అందరి చూపు ఉంటుంది.

GT vs CSK Qualifier 1: తొలి క్వాలిఫైయర్‌లో ఈ ఐదుగురే కీలకం.. లిస్టులో చివరి సీజన్ ఆడే ప్లేయర్?
Gt Vs Csk Q1
Follow us on

IPL 2023 GT vs CSK Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరిగాయి. నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈరోజు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఈ 5 మంది ఆటగాళ్ల ప్రదర్శనపైనే అందరి చూపు నెలకొంది.

1- రషీద్ ఖాన్: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్పిన్‌ మ్యాజిక్‌తో చెపాక్ పిచ్‌పై విధ్వంసం సృష్టించగలడు. ఈ సీజన్‌లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు రషీద్ 24 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో పర్పుల్ క్యాప్ హోల్డర్ మహ్మద్ షమీ తో సమానంగా నిలిచాడు.

2- శివమ్ దూబే: ఎడమచేతి వాటం తుఫాన్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఈ సీజన్‌లో భిన్నమైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో శివమ్ బ్యాట్‌ నుంచి పొడవైన సిక్సర్లు కనిపించాయి. ఐపీఎల్ 2023లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్ శివమ్.. ఇప్పటి వరకు 33 సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

3- శుభమన్ గిల్: గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. రెండు సెంచరీలతో గిల్‌ బ్యాట్‌ నుంచి ఇప్పటివరకు 680 పరుగులు వచ్చాయి.

4- రుతురాజ్ గైక్వాడ్: చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లే అతిపెద్ద బాధ్యత రుతురాజ్ గైక్వాడ్‌పై ఉంది. గైక్వాడ్ ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేశాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుంచి 28 సిక్సర్లు కూడా వచ్చాయి.

5- మహేంద్ర సింగ్ ధోని: ఈరోజు అందరి చూపు ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరైన ఎంఎస్ ధోనిపైనే ఉంది. అసలే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో చెపాక్‌లో ధోని ఆడటం చివరిసారి చూస్తామని అభిమానులు కూడా ఊహిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..