Rishabh Pant Accident: గెట్ వెల్ సూన్ బ్రదర్.. నీ వెనుకే మేమంతా: పంత్ ఆరోగ్యంపై వార్నర్ స్పెషల్ పోస్ట్..
IPL 2023: రిషబ్ పంత్ కోలుకోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ప్రార్థించాడు. పంత్‌తో ఉన్న ప్రత్యేక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Rishabh Pant: భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు చాలా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతలో ఆస్ట్రేలియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ పంత్ కోసం చాలా ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నాడు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.
పంత్ క్షేమం కోరుతూ..
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, తన టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటో క్యాప్షన్‌లో వార్నర్ ‘గెట్ వెల్ సూన్ బ్రదర్, మేమంతా నీ వెనుకాలే ఉన్నాం’ అని రాశాడు.
డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అదే సమయంలో ఈ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కారు ప్రమాదానికి గురైన పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.
కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్..
View this post on Instagram
పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్‌కు జట్టు నాయకత్వాన్ని అప్పగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో వార్నర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించగా, ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆయన కెప్టెన్సీలో IPL టైటిల్‌ను గెలుచుకున్నాడు.
రిషబ్ పంత్ 30 డిసెంబర్ 2022న ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరమైన కారు ప్రమాదం తర్వాత పంత్‌ను డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఇప్పుడు తదుపరి చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..