Most Runs and Wickets in IPL 2023: ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 53 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అంటే, ఈ టోర్నీలో మూడింట రెండు వంతులకు పైగా పూర్తయింది. ఈ టోర్నీలో అత్యంత ముఖ్యమైన రెండు అవార్డుల రేసులో ఫాఫ్ డు ప్లెసిస్, మహ్మద్ షమీ ముందంజలో ఉన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డుప్లెసిస్ నిలిచాడు. దీంతో ఆయనకు ఆరెంజ్ క్యాప్ దక్కింది. అదే సమయంలో వికెట్లు తీయడంలో మహమ్మద్ షమీ ముందు వరుసలో ఉన్నాడు. అతను పర్పుల్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు వారి వారి విభాగాల్లో కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నారు. వారికి సవాల్ విసురుతున్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కంటే కేవలం 34 పరుగులు వెనుకంజలో నిలిచాడు. శుభ్‌మన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. డుప్లెసిస్‌కు గిల్‌కు మధ్య 42 పరుగుల అంతరం మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ భారత యువ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఖచ్చితంగా డుప్లెసిస్‌ను వదిలివేయగలరు.
గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రషీద్ ఖాన్, తుషార్ దేశ్‌పాండేలు షమీ పేరిట ఉన్నన్ని వికెట్లు తీశారు. ఈ రేసులో పీయూష్ చావ్లా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్ కూడా కేవలం తలొ 2 వికెట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..