IPL 2023, MS Dhoni: ‘ధోనీ పట్టుకున్న ప్ర‌తీది బంగారంగా మారుతుంది’.. చెన్నై కెప్టెన్‌పై ‘మిస్టర్ ఐపీఎల్’ ప్రశంసల వర్షం..

|

May 25, 2023 | 8:05 PM

IPL 2023, MS Dhoni: బుధవారం జరిగిన ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 15  పరుగుల తేడాతో విజయం సాధించి, నేరుగా టోర్నీ ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 10వ సారి టోర్నీ..

IPL 2023, MS Dhoni: ‘ధోనీ పట్టుకున్న ప్ర‌తీది బంగారంగా మారుతుంది’.. చెన్నై కెప్టెన్‌పై ‘మిస్టర్ ఐపీఎల్’ ప్రశంసల వర్షం..
Suresh Raina On Ms Dhoni
Follow us on

IPL 2023, MS Dhoni: బుధవారం జరిగిన ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 15  పరుగుల తేడాతో విజయం సాధించి, నేరుగా టోర్నీ ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 10వ సారి టోర్నీ ఫైనల్‌కి చేరిన జట్టుగా కూడా ధోని సేన నిలిచింది. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేష్ రైన్  ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని తాకిన ప్రతిదీ బంగారంగా మారుతుందని, చెపాక్ స్టేడియంలో చెన్నై టీమ్‌ని ఓడించడం అంటే పెద్ద సవాలేనని పేర్కొన్నాడు.

సురేష్ రైనా మాట్లాడుతూ.. ‘ ధోని తాకితే ఏదైనా బంగారంగా మారుతుంది. ఈ సీజన్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై టీమ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని దేశంలోని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌పై గెలవడం ద్వారా చెన్నై టీమ్ పదో సారి ఐపీఎల్ ఫైనల్‌కి చేరింది. ధోని సేన ఆడిన 14 సీజన్‌లలోనే 12 సార్లు ప్లేఆఫ్స్, 10 ఫైనల్స్‌కు ఎలా చేరుకున్నారో మీరే చూడండి, ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎంఎస్ ధోని దానిని సింపుల్‌గా తీసుకుంటాడు. కానీ దీనంతటికి అతనే కారణం, ధోనీ కోసం అయినా ఈ టోర్నీ టైటిల్ గెలవాలని రుతురాజ్ గైక్వాడ్ నాతో చెప్పాడ’ని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రతిష్టాత్మక ఐపీఎల్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు విజేతగా నిలిచింది. మరోవైపు చెన్నై చేతిలో ఓడిన గుజరాత్.. రెండో క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో క్వాలిఫైయర్‌‌కి అర్హత సాధించింది. ఇక రెండో క్వాలిఫైయర్‌‌లో గెలిచిన టీమ్(గుజరాత్ లేదా ముంబై)తో చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ ఫైనల్‌లో ఈ నెల 28న తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..