ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎంఎస్ ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 41 వయసులోనూ తాను కొట్టే బంతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక ధోని క్రీజులో ఉన్నాడంటే అభిమానులు టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోవాల్సిందే. అవును.. ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో మరోసారి అదే జరిగింది. రాజస్థాన్ ఇచ్చిన 176 పరుగులను చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగారు చెన్నై బ్యాటర్లు. ఆ సమయంలో జీయో సినమా వ్యూస్ కొంచెం అటుఇటుగా 60 లక్షలు మాత్రమే. కానీ ఎప్పుడైతే ధోని రంగంలోకి దిగాడో.. ఆ క్షణమే దాదాపు 70 లక్షల వ్యూస్ అమాంతం పెరిగిపోయాయి. 18వ ఓవర్‌లో ధోని మొదటి సిక్స్ కొట్టేనాటికి అది 2 కోట్లకు చేరువలోకి వచ్చింది. అంతేనా..? ధోని చివరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టే సమయానికి జీయో వ్యూస్ సంఖ్య ఏకంగా 2.2 కోట్లకు చేరింది. దీంతో జియో సినిమా వ్యూవర్‌షిప్ ఒక్కసారిగా చుక్కల్లో తేలినట్లయింది.
అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసినప్పుడు 1.7 కోట్ల వ్యూస్ రాగా.. ఆర్‌సీబీ, లక్నో మ్యాచ్‌లో 1.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. కానీ ఈ రోజు ధోని తన బ్యాట్‌తో మూడు సిక్సర్లు కొట్టడంతో పాటు జీయో సినిమా వ్యూస్ పాత రికార్డులను తిరగరాశాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 17 బంతులే ఆడి, 32 పరుగులు రాబట్టాడు. వీటిలో 3 సిక్సర్లు, 1 బౌండరీ కూడా ఉన్నాయి.
For one moment, 2.2 Cr Indians held their breath. Old memories rushed back. A familiar expectation took over.
It didn’t quite end like it used to but for one moment, time stood still for 20 million+ people.
One moment. One MS Dhoni. #IPLonJioCinema #TATAIPL #IPL2023 #CSKvRR pic.twitter.com/joo2Qm24Ve
— JioCinema (@JioCinema) April 12, 2023
కాగా, ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కూడా రాజస్థాన్ రాయల్స్‌కి విజయంపై ఆశలు లేకుండా చేశాడు మహీ. చివరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి సంజూ శామ్సన్ సేనను ఓటమి అంచులకు చేర్చినంత పనిచేశాడు. కానీ చివరి మూడు బంతులలో 7 పరుగులు చేయవలసి ఉండగా, మూడు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇక ఆ టీమ్ తరఫున జాస్ బట్లర్(52), దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్‌మెర్(30 నాటౌట్) రాణించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన చెన్నై తన ఇన్నింగ్స్‌లో 172 పరుగులే చేయగలిగింది. ఇక చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే(50), అజింక్యా రహానే(38), ధోనీ(32), జడేజా(25) పరుగులు చేశారు
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..