ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ 16వ ఎడిషన్ ఆసక్తికరంగా జరుగుతోంది. సగం మ్యాచ్‌లు పూర్తి కావడంతో ఇప్పుడిప్పుడే ప్లే ఆఫ్ బెర్తులపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కాగా గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి పేలవంగా ఆడుతోంది. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ స్టార్ ఆటగాడు పార్టీలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఈ కథనం సారాంశం. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత జరిగిన పార్టీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాడి పేరు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ ఘటన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఆటగాళ్ల భద్రతకు సంబంధించి కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. వీటి ప్రకారం ఇకపై అతిథులు ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లడానికి అనుమతి లేదు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత ఆటగాళ్లు తమ గదులు దాటి బయటకు వెళ్లడానికి పర్మిషన్ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను కలవాలంటే ఫోటో గుర్తింపుతో పాటు, IPL జట్టు అధికారి నుండి అధికారిక అనుమతి తప్పనిసరిగా పొందాలి. లేకపోతే హోటల్‌లోని రెస్టారెంట్ లేదా కాఫీ షాప్‌లో ఆటగాళ్లను కలవవచ్చని పేర్కొంది.
అలాగే ఢిల్లీ ఆటగాళ్లు ఇక నుంచి హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫ్రాంచైజీకి కచ్చితంగా సమాచారం అందజేయాలి. ఆటగాళ్లు వారి సొంత ఖర్చుతో తమ ఫ్యామిలీని కలుకోవడానికి వెళ్లవచ్చు. అయితే ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫ్రాంచైజీ మీటింగ్, ఈవెంట్లకు హాజరు కావాలి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఆటగాళ్లకు జరిమానా కూడా విధిస్తామని ఢిల్లీ ప్రాంఛైజీ హెచ్చరించింది. ఇప్పటికే వరుస ఓటములతో షాక్‌లో ఉన్న ఢిల్లీ జట్టుకు ఈ ఘటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ సేన కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్డడుగున నిలిచింది.
? Grooving to the tunes of #RoarKaShor ?
What are you listening to today? #YehHaiNayiDilli #JBLxDC @JBLSoundIn pic.twitter.com/P960iewJa4
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..