IPL 2023: 7 ఏళ్ల కొడుకు ముందు ఏడడుగులు నడిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్..

|

Apr 10, 2023 | 9:53 PM

Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. అతను IPL 2023 సమయంలో స్నేహితురాలు గ్రేటా మాక్‌ను వివాహం చేసుకున్నాడు. మార్ష్ తన 7 ఏళ్ల కొడుకు ముందు వరుడిగా మారాడు.

IPL 2023: 7 ఏళ్ల కొడుకు ముందు ఏడడుగులు నడిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్..
mitchell-marsh-ties-knot-with-girlfriend
Follow us on

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. అతను IPL 2023 సమయంలో స్నేహితురాలు గ్రేటా మాక్‌ను వివాహం చేసుకున్నాడు. మార్ష్ తన 7 ఏళ్ల కొడుకు ముందు వరుడిగా మారాడు. మార్ష్, గ్రెటా చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతను 2016లో జన్మించాడు. సోమవారం పెళ్లికి సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త అందించాడు మార్ష్. తన పెళ్లికి సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తూ, ఇది తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజంటూ చెప్పుకొచ్చాడు.

మార్ష్ కొన్ని రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్లాడు. అతను రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మార్ష్ ఒక వారం పాటు ఆస్ట్రేలియాలోని తన ఇంటికి వెళ్లాడు. కాగా, మార్ష్‌ను రూ.6.50 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

2 మ్యాచ్‌ల్లో సత్తా చాటని మార్ష్..

అయితే ఢిల్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ మార్ష్ సత్తా చాటలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అతను 4 పరుగులు మాత్రమే చేశాడు. 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

మార్ష్ భార్య గురించి మాట్లాడితే.. గ్రేటా డిజిటల్ మార్కెటింగ్‌తో సంబంధం కలిగి ఉంది. 2020 వరకు ఒక రిసార్ట్‌లో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసింది. ఆమె ఒక సంస్థకు కో-డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థంలో మార్ష్ గ్రేటాకు ప్రపోజ్ చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..