IPL 2023: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడ్డ ప్రముఖ కామెంటేటర్‌.. వారిలో మొదలైన టెన్షన్‌

|

Apr 05, 2023 | 6:30 AM

నిన్న (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కి కామెంటేటర్‌గా ఆకాశ్ చోప్రా నే వ్యవహరించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా చోప్రా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చినట్లు కామెంట్రీ ప్యానెల్‌ తెలిపింది.

IPL 2023: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడ్డ ప్రముఖ కామెంటేటర్‌.. వారిలో మొదలైన టెన్షన్‌
Ipl 2023
Follow us on

ఐపీఎల్ 2023 సీజన్‌లో కరోనా కలకలం రేపింది. ధనాధన్‌ లీగ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కొవిడ్‌ బారిన పడ్డాడు. మంగళవారం రాత్రి జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు చోప్రాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నిఅతనే స్వయంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం హిందీ కామెంట్రీ ప్యానల్‌లో కీ మెంబర్‌గా ఉన్నాడు చోప్రా. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కొన్ని రోజుల పాటు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు ఈ మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. నిన్న (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కి కామెంటేటర్‌గా ఆకాశ్ చోప్రా నే వ్యవహరించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా చోప్రా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చినట్లు కామెంట్రీ ప్యానెల్‌ తెలిపింది.

కాగా ఐపీఎల్ హిందీ కామెంట్రీ ప్యానల్‌లో ఆకాశ్‌ చోప్రాతో పాటు జహీర్ ఖాన్, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాబిన్ ఉతప్ప, ఆర్పీ సింగ్, పార్థీవ్ పటేల్ తదితర భారత మాజీ క్రికెటర్లు ఉన్నారు. వీరు ఇప్పటివరకు ఆకాశ్ చోప్రాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకి కామెంట్రీచెప్పుకొచ్చారు . అయితే కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు ఆకాశ్ చోప్రా వెల్లడించగానే ఆ ప్యానల్‌లోని మాజీ క్రికెటర్లలోనూ టెన్షన్ మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..