Arjun Tendulkar: ధనాధన్ లీగ్‌లో తొలి సిక్సర్ కొట్టిన జూ.టెండూల్కర్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..

|

Apr 26, 2023 | 8:38 AM

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ తన తొలి ఐపీఎల్ సిక్సర్ కొట్టాడు. గుజరాత్ టీమ్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తరఫున తొమ్మిదో స్థానంలో అర్జున్ బ్యాటింగ్‌కి వచ్చాడు. అలా మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో..

Arjun Tendulkar: ధనాధన్ లీగ్‌లో తొలి సిక్సర్ కొట్టిన జూ.టెండూల్కర్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
Arjun Tendulkar
Follow us on

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ తన తొలి ఐపీఎల్ సిక్సర్ కొట్టాడు. గుజరాత్ టీమ్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తరఫున తొమ్మిదో స్థానంలో అర్జున్ బ్యాటింగ్‌కి వచ్చాడు. అలా మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో డీప్‌స్వ్కేర్‌ దిశగా ఒక భారీ సిక్స్‌ బాదాడు. అలా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. మరోవైపు అర్జున్ తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ఇలా భారీ సిక్సర్‌ కొట్టడంతో టెండూల్కర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అర్జున్‌లో బౌలర్ మాత్రమే కాక మంచి బ్యాటర్ కూడా ఉన్నాడని, బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ ఇవ్వాలని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రానున్న మ్యాచ్‌ల్లో అతన్ని మిడిలార్డర్ బ్యాట్స్‌మ్యాన్‌గా క్రీజులోకి పంపితే మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌తో ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 9 బంతులలో ఒక భారీ సిక్సర్‌తో పాటు 13 పరుగులు చేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై  ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది ఈ క్రమంలో గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్(56), డేవిడ్ మిల్లర్(46), అభినవ్ మనోహర్(42) మెరుగ్గా రాణించారు. ముంబై తరఫున పియూష్ చావ్లా 2, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, జేసన్ బెహ్రండర్ఫ్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 208 భారీ లక్ష్యంలో క్రీజులోకి వచ్చిన ముంబై బ్యాటర్లు తొలి నుంచే తడబడుతూ 9 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగారు.  ఈ క్రమంలో ముంబై తరఫున నెహల్ వథేరా(40), కామెరూన్ గ్రీన్(33) మాత్రమే మెరుగ్గా రాణించారు. ఇక గుజరాత్ తరఫున నూర్ అహ్మద్ 3 వికెట్లను పడగొట్టగా.. మోహిత్ శర్మ, రషిద్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అలాగే గుజరాత్ కెప్టెన్ హర్దిక్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..