Yuzvendra Chahal: సుదీర్ఘకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు ప్రాతినిథ్యం వహిస్తూ ఆ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. సుమారు 8 సీజన్ల పాటు బెంగళూరుకు సేవలందించిన యూజీ.. తన ఐపీఎల్ కెరీర్‌లో 114 మ్యాచ్‌ల్లో మొత్తం 139 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్(IPL-2022)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు చాహల్. కాగా ఆర్సీబీని వీడిన తర్వాత అతనిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు జట్టులో కొనసాగేందుకు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడన్న వార్తలు పుకార్లు చేశాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన చాహల్ (Yuzvendra Chahal) ఆర్సీబీతో తన అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అది నన్ను బాధించింది..
‘ఐపీఎల్‌లో బెంగళూరుకు కాకుండా మరే ఇతర జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఎందుకంటే ఆ జట్టుతో నా అనుబంధం అలాంటిది. ఆర్సీబీ సభ్యులు, అభిమానులతో నేను బాగా మమేకమైపోయాను. అయితే ఐపీఎల్ -2022 రిటెన్షన్ సమయంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీలో కొనసాగేందుకు నేను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నిజానికి ఆర్సీబీ నన్ను రిటెయిన్ చేసుకునేందుకు కానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు కానీ ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ నాకు ఫోన్ చేశాడు. రిటెన్షన్‌లో మూడు స్థానాలు కోహ్లీ, మ్యాక్స్ వెల్, సిరాజ్‌లతో భర్తీ చేయనున్నట్లు తెలిపాడు. దీనికి నేను ఏ మాత్రం బాధపడలేదు. హెస్సన్ నన్ను వేలంలో దక్కించుకుంటానని చెప్పి ఉంటే ఎంతో సంతోషించేవాడినని. కానీ అతనేమీ చెప్పలేదు. ఇది నన్ను బాగా బాధించింది. ఏదేమైనా నేను ఐపీఎల్ అరంగేట్రం చేసిన జట్టుకే తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు యూజీ.
Also Read:40 పైసలు ఎక్కువ చార్జ్ చేశారని కోర్టుకెక్కిన కస్టమర్ !! ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ??
Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలో ఆహారం తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు!
PM Kisan Scheme: రైతులకు అలర్ట్.. ఆ వివరాలు పూర్తిచేయకుంటే డబ్బులు రావు.. రెండు రోజులే ఛాన్స్..