IPL 2022: విలన్లుగా మారిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. రూ. 16 కోట్లు వేస్ట్ అంటోన్న నెటిజన్లు.. ఎవరో తెలుసా!

ఐపీఎల్ 2022‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లలో..

IPL 2022: విలన్లుగా మారిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. రూ. 16 కోట్లు వేస్ట్ అంటోన్న నెటిజన్లు.. ఎవరో తెలుసా!
Kolkata
Follow us

|

Updated on: May 03, 2022 | 12:01 PM

ఐపీఎల్ 2022‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లలో పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తోంది. జట్టును కాపాడతారనుకున్న సీనియర్లు చేతులెత్తేయగా.. ఎన్నో ఆశలు పెట్టుకుని కొంతమంది యువ ప్లేయర్లు ఆశించదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారు. దీనితో ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు రెండు పెద్ద మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 16 కోట్లు పెట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళిద్దరిని తుది జట్టు నుంచి తొలగించింది. వాళ్లెవరో కాదు.. మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ వరుణ్ చక్రవర్తి.

ఈ ఇద్దరు ఆటగాళ్లను కోల్‌కోతా నైట్ రైడర్స్ జట్టు చెరో రూ. 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇక ఆ రూ. 16 కోట్లు ప్రస్తుతం నీళ్ల పాలయ్యాయని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌లు వారి స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోతున్నారు.

వెంకటేష్ అయ్యర్‌ను ఓపెనర్‌గా ప్రయత్నించిన కోల్‌కతా యాజమాన్యానికి ప్రతీసారి నిరాశే ఎదురైంది. అటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా బంతితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. వెరిసి.. వీరిద్దరూ ఇప్పటివరకు కోల్‌కతా పరాజయాల్లో భాగస్వాములుగా నిలిచారని జనాలు తిట్టిపోస్తున్నారు. కాగా, ఇదే ఆటతీరు టోర్నీ మొత్తం కొనసాగితే.. వీరిద్దరికీ జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువేనని మాజీ ప్లేయర్స్ అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Also Read: