IPL 2022: ఏం బౌలింగ్ వేస్తున్నావ్? మైండ్ దొబ్బిందా? సన్‌రైజర్స్ బౌలర్‌పై మురళీధరన్ ఆగ్రహం.. నెట్టింట్లో వైరల్ వీడియో..
GT vs SRH: గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ (GT vs SRH) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
GT vs SRH: గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ (GT vs SRH) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ హైస్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది హార్ధిక్ సేన. సన్‌రైజర్స్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి అందుకుంది గుజరాత్. కాగా ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. అయితే ఇక్కడ జాన్సెన్ బాగానే బౌలింగ్ చేసినప్పటికీ రషీద్ దూకుడు ముందు తన ప్రణాళికలేవి పనిచేయలేదు. దీంతో తుది ఓవర్‌లో హైదరాబాద్‌కు పరాజయం తప్పలేదు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్య చేధన సమయంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కో జాన్సెన్ చెత్త రికార్డును అందుకున్నాడు. కాగా ఈ సమయంలో సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మైండ్ దొబ్బిందా? కాగా చివరి ఓవర్‌లో 6, 1, 6, 0, 6, 6 ఇచ్చి సన్ రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. కాగా చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని జాన్సెన్ చేజార్చుతుండటంతో డగౌట్‌లో కూర్చుని ఉన్న మురళీధరన్ సహనం కోల్పోయాడు. మ్యాచ్ ఓడిపోవడంతో ‘కీలక దశలో ఫుల్ లెంగ్త్ బంతులను వేయడం ఏంటి?.. మైండ్ దొబ్బిందా.. అసలేం బౌలింగ్ చేస్తున్నాడు’ అంటూ జాన్సెన్‌ని పరుష పదుజాలతో తిడుతూ కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
beauty of IPL pic.twitter.com/Nswvs2domu
— best girl | IPL era (@awkdipti) April 27, 2022
Murali getting Angry during the 20 th over pic.twitter.com/jvcjVh4Kpp
— Kaveen Wijerathna (@CricCrazyKaveen) April 27, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!
Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని సీఎం తేల్చిచెప్పారు.. మాజీ మంత్రి వ్యాఖ్య