IPL Purple Cap 2022: పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముందున్న హసరంగా.. చాహల్‌కు మిగిలి ఉన్న మరో అవకాశం..

|

May 28, 2022 | 7:49 AM

IPL 2022లో ఫైనల్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో రాజస్థాన్ రాయల్స్‌(RR) తలపడనుంది...

IPL Purple Cap 2022: పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముందున్న హసరంగా.. చాహల్‌కు మిగిలి ఉన్న మరో అవకాశం..
hasaranga
Follow us on

IPL 2022లో ఫైనల్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో రాజస్థాన్ రాయల్స్‌(RR) తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బెంగళూరును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లతో రాజస్థాన్‌ బౌలర్‌ ఆర్సీబీ ఆటగాడు హసరంగా, చాహల్‌ సమానస్థితిలో ఉండగా ఎకానమీ రేటు ఆధారంగా హసరంగా అగ్ర స్థానంలో ఉన్నాడు. అయితే అగ్రస్థానానికి చేరుకోవడానికి చాహల్‌ మరో ఛాన్స్‌ ఉంది. ఫైనల్లో చాహల్‌ ఒక్క వికెట్‌ తీసినా పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకోవచ్చు. హసరంగా 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో రెండో స్థానం నిలిచాడు. రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఔట్‌ చేయడం ద్వారా హసరంగా 26 వికెట్లు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో చాహల్‌ ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు.

చాహల్‌ 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. చాహల్ ప్రస్తుతం KKRపై హ్యాట్రిక్‌తో సాధించాడు. క్వాలిఫైయర్‌ 1లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. దీంతో పర్పుల్‌ క్యాప్‌ ఎవరికి వస్తుందా అని ఆసక్తి నెలకొంది. మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కగిసో రబడ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానంలో హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అతను తన పేస్‌తో చాలా మంది టాప్-క్లాస్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌ చేశాడు. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ హర్ష్‌దీప్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.