IPL 2022: 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు.. ఒక్కసారిగా విలన్‌గా మారిన 8 కోట్ల ప్లేయర్‌ ఎవరో తెలుసా?

|

Apr 30, 2022 | 1:46 PM

గత ఐపీఎల్‌ సీజన్‌లో బాగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) కూడా ఒకడు. స్వదేశంలో జరిగిన తొలి అంచె పోటీల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ ఆల్‌రౌండర్‌ దుబాయిలో జరిగిన రెండో దశ పోటీల్లో మాత్రం చెలరేగాడు

IPL 2022: 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు.. ఒక్కసారిగా విలన్‌గా మారిన 8 కోట్ల ప్లేయర్‌ ఎవరో తెలుసా?
Ipl 2022
Follow us on

గత ఐపీఎల్‌ సీజన్‌లో బాగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) కూడా ఒకడు. స్వదేశంలో జరిగిన తొలి అంచె పోటీల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ ఆల్‌రౌండర్‌ దుబాయిలో జరిగిన రెండో దశ పోటీల్లో మాత్రం చెలరేగాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తాచాటాడు. మొత్తం మీద 10 ఇన్నింగ్స్‌ల్లో 128.47 స్ట్రైయిక్ రేటుతో 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. బంతితోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. మొదటి దశలో కేవలం రెండు మ్యాచ్‌లు గెలిచి ఫ్లే ఆఫ్‌ రేసులో వెనకబడ్డ కోల్‌కతా వెంకటేశ్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఏకంగా ఫైనల్ వరకు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఆఖరిమెట్టుపై బోల్తాపడింది. అయితే తన అద్భుతమైన ఆటతీరుతో పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్‌ అయ్యర్. అదే ఊపులో టీమిండియాలోనూ స్థానం దక్కించుకున్నాడు. ఈక్రమంలో గత సీజన్ ప్రదర్శన కారణంగానే అతనిని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (KKR) యాజమాన్యం.

లోపించిన ఆత్మవిశ్వాసం..

కాగా ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశపర్చాడీ లెఫ్ట హ్యాండర్‌ బ్యాటర్‌. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన అయ్యర్ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో చేసిన 50 పరుగులు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌. ఈ మ్యాచ్‌ను పక్కనపెడితే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కలిపి 82 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిచేత హీరో అనిపించుకున్న వెంకటేశ్‌ ఈ సీజన్‌లో మాత్రం కాస్త విలన్‌గా మారిపోయాడు. అతని వైఫల్యంతో కోల్‌కతా జట్టు కూడా వరుసగా ఓటములు ఎదుర్కొంటోంది. మరోవైపు ఎవరికైతే వెంకటేశ్‌ను ప్రత్యామ్నాయం అనుకున్నారో ఇప్పుడు అదే హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్‌గా కూడా గుజరాత్ టైటాన్స్‌ను ముందుండి నడిపించడమే కాకుండా బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా అదరగొడుతున్నాడు. గత సీజన్‌లో అయ్యర్‌లో కనిపించిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు కనిపించడం లేదని, అతను తన లోపాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Traffic Challans: వాహనదారులకు పోలీసుల వార్నింగ్‌.. పెండింగ్‌ చలానాలు క్లియర్‌ చేయకపోతే ఇక అంతే సంగతులు..

CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?