IPL 2022 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. వాస్తవానికి, టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఆడటంపై ఉత్కంఠ నెలకొంది. అతను ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XIలో భాగం కాలేడని సమాచారం. ముంబై మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ ఓ కీలక ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, అతను ఆడకపోవడం జట్టుకు సమస్యలను సృష్టిస్తుంది. అది కూడా టోర్నీలో తొలి మ్యాచ్ ఉండగా, ప్రతి జట్టు విజయంతో ప్రారంభించడానికి మైదానంలోకి దిగేందుకు ఆలోచిస్తుంటాయి.
సూర్యకుమార్ యాదవ్ మొదటి మ్యాచ్‌లో ఆడకపోవడానికి కారణం అతని గాయం అని తెలుస్తోంది. అతను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన భారత బ్యాట్స్‌మన్ శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2022 మొదటి మ్యాచ్‌లో కూడా ఆడటం కష్టంగా మారింది.
గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం..
PTI వార్తల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ బొటనవేలు గాయం నుంచి కోలుకోవడానికి సమయం తీసుకుంటాడు. దీని కారణంగా అతను IPL 2022 మొదటి మ్యాచ్‌లో ఆడలేడు. IPL 2022 మొదటి మ్యాచ్ మార్చి 27న జరగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సవాల్‌గా మారనుంది.
బీసీసీఐ సీనియర్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ, “సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. గాయం నుంచి కోలుకునే దశలో ఉన్నాడు. అయితే అతను ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్ ఆడతాడని ఇప్పుడే చెప్పడం కష్టం. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు దూరంగా ఉండమని బోర్డు వైద్య సిబ్బంది అతన్ని కోరే అవకాశం ఉంది’ అని తెలిపారు.
ఏప్రిల్ 2న బరిలోకి దిగే ఛాన్స్..
ముంబై ఇండియన్స్ IPL 2022లో తమ రెండవ మ్యాచ్‌ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. సూర్యకుమార్ రెండో మ్యాచ్‌లో ఆడాలని భావిస్తున్నారు. “అప్పటికి సూర్యకుమార్ పూర్తి ఫిట్‌గా ఉంటాడు. అతను ఆడటానికి సిద్ధంగా ఉంటాడు” అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసిన నలుగురు ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ఆట తీరుతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
IPL 2022: ఐపీఎల్ టీమ్స్ కు అలెర్ట్.. కొత్త నిబంధనలు ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే..