
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రదర్శన ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచి పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) తర్వాత మూడో స్థానంలో ఉంది. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ ఫొటోలో భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ అందమైన అమ్మాయి గెటప్‌లో కనిపించారు. సుందర్ ఫోటో క్యాప్షన్‌లో ‘కొత్త అభిరుచి’ అని రాసుకొచ్చాడు. ఈమేరకు అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాషింగ్టన్ సుందరితో భువనేశ్వరి చట్టాపట్టాల్ అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుత ఐపీఎల్‌లో భువీ టచ్‌లో కనిపిస్తున్నాడు. దీనికి ముందు, IPL 2021లో భువనేశ్వర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో భువనేశ్వర్ 23 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2017 ఐపీఎల్‌లో 26 వికెట్లు తీశాడు.
గత కొన్నేళ్లుగా, గాయాల కారణంగా ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో భువీ ప్రదర్శన క్షీణించింది. ఐపీఎల్ 2022 వేలంలో భువనేశ్వర్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేయగా.. మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ బేస్ ధర రూ.2 కోట్లు. 2014-21లో భువనేశ్వర్ కుమార్ కూడా ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యాడు.
సుందర్ రూ. 8.75 కోట్లకు అమ్ముడయ్యాడు..
వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడితే, మెగా వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ అతన్ని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. వాషింగ్టన్ సుందర్ బేస్ ధర రూ. 1.50 కోట్లు కాగా, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. సుందర్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో భాగంగా ఉన్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IPL 2022: స్టేడియం వద్దకు వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ గంభీర్..
PBKS vs LSG Highlights: రాణించిన దీపక్ హుడా.. 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై లక్నో విజయం