IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!

|

Apr 29, 2022 | 9:45 AM

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలో చాలా దూకుడుగా మారాడు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ అంపైర్ నిర్ణయంతో విభేదించి గొడవకు దిగాడు.

IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!
Rishabh Pant
Follow us on

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలో చాలా దూకుడుగా మారాడు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ అంపైర్ నిర్ణయంతో విభేదించి గొడవకు దిగాడు. KKR తో జరిగిన మ్యాచ్‌లో అతను ఫుల్ టాస్ బాల్‌ గురించి అంపైర్‌తో వాదిస్తాడు. అయితే కొంత సేపటికి రీప్లే చూపించగా అసలు నిజం బయటపడింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ ఫుల్ టాస్ బంతి కారణంగా అంపైర్‌తో గొడవపడ్డాడు. ఆ గొడవ తర్వాత పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు. అయినా కూడా గురువారం పంత్ మరోసారి అదే పని చేసి మైదానంలో అంపైర్‌తో గొడవకు దిగాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గెలిచింది. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ వివాదాలకు దూరంగా ఉండలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. రిషబ్ పంత్ 17వ ఓవర్ లలిత్ యాదవ్‌కు ఇచ్చాడు. ఓవర్‌లోని మూడో బంతికి అవుట్ ఆఫ్‌లో నడుము ఎత్తు వరకు ఫుల్ టాస్ వేయగా KKR ప్లేయర్ నితీష్ రాణా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో రిషబ్ పంత్ మండిపడ్డాడు. ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే కాసేపట్లో ఈ విషయం సద్దుమణిగింది.

కాసేపటి తర్వాత ఈ బంతికి సంబంధించిన రిప్లే తెరపై కనిపించింది. అక్కడ బంతి నో బాల్ అని స్పష్టంగా తేలింది. అయితే నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌ వస్తుంది. కానీ రానా సింగిల్‌ను మాత్రమే సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్‌ల బౌలింగ్‌ ఆకట్టుకుంది. 8 మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది నాలుగో విజయం.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Car Mileage: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా.. ఒక్కసారి వీటిని పాటించి చూడండి..!

IPL 2022: ఆయన నాకు అన్నయ్య లాంటివాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదు..!

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి మార్కెట్లో మంచి డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!