Venkatesh Iyer: గతంలో 20 లక్షలు..ఇప్పుడు 8 కోట్లు.. ఐపీఎల్‌ రిటెన్షన్‌లో జాక్‌పాట్‌ కొట్టిన వెంకటేష్‌ అయ్యర్‌..

|

Dec 01, 2021 | 2:23 PM

టీమిండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెంకటేష్‌ అయ్యర్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. గత వేలంలో కేవలం రూ.20లక్షలకే ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌ను..

Venkatesh Iyer: గతంలో 20 లక్షలు..ఇప్పుడు 8 కోట్లు.. ఐపీఎల్‌ రిటెన్షన్‌లో జాక్‌పాట్‌ కొట్టిన వెంకటేష్‌ అయ్యర్‌..
Follow us on

టీమిండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెంకటేష్‌ అయ్యర్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. గత వేలంలో కేవలం రూ.20లక్షలకే ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్‌ ఫ్రాంఛైజీ ఈసారి ఏకంగా రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌-2021లో భాగంగా దుబాయి వేదికగా జరిగిన రెండో దశ పోటీల్లో అంచనాలకు మించి రాణించాడు వెంకటేష్‌. మొత్తం10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు సాధించి జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రతిభతోనే టీమిండియాలో కూడా స్థానం సంపాదించాడు. అందుకే అతడిని రిటైన్‌ చేసుకునేందుకు కేకేఆర్‌ ఫ్రాంఛైజీ.. ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది.

తాజా రిటెన్షన్‌ ప్రక్రియతో గతంలో కంటే 40 రెట్ల (4000 శాతం) మొత్తాన్ని అధికంగా అందుకోనున్నాడు వెంకటేష్‌. కాగా మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ 2020 రిటెన్షన్‌ ప్రక్రియలో అయ్యర్‌తో పాటు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), మిస్టరీ స్పి్న్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), విండీస్‌ స్పి్న్నర్‌ సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకుంది. వీరి నలుగురి కోసమే ఏకంగా 42 కోట్లు ఖర్చు చేసింది కేకేఆర్‌ ఫ్రాంఛైజీ.. కోల్‌కతా పర్సులో ఇంకా 48 కోట్ల రూపాయలు ఉన్నాయి.

Also Read:

తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో

Shardul Thakur: ప్రియురాలితో శార్దూల్‌ ఠాకూర్‌ నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోలు..

Dinesh Karthik: ముంబై టెస్ట్‎ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..