IPL 2022: కోల్‌కతాకు షాకిచ్చిన రాజస్థాన్.. అగ్రస్థానం చేరిన శాంసన్ సేన.. టాప్ 4లో ఎవరున్నారంటే?

|

Apr 11, 2022 | 6:51 AM

ఐపీఎల్‌ 15 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై మూడు పరుగుల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టిక నుంచి కోల్‌కతాను వెనక్కు నెట్టింది.

IPL 2022: కోల్‌కతాకు షాకిచ్చిన రాజస్థాన్.. అగ్రస్థానం చేరిన శాంసన్ సేన.. టాప్ 4లో ఎవరున్నారంటే?
RR
Follow us on

ఐపీఎల్‌ 15(IPL 2022) సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై మూడు పరుగుల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టిక నుంచి కోల్‌కతా(Kolkata Knight Riders)ను వెనక్కు నెట్టింది. దీంతో మొత్తంగా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. అయితే, కోల్‌కతా టీం కూడా 6 పాయింట్లు సాధించగా, రన్ రేట్ విషయంలో ముందుడడంతో రాజస్థాన్ టీం అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా 2వ స్థానం, గుజరాత్ 3వ, రాయల్స ఛాలెంజర్స్ 4వ స్థానంలో చేరాయి. అటు ఢిల్లీ టీమ్‌ రెండో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ బౌలర్లు మరోసారి మ్యాజిక్‌ చేశారు. లక్నో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు. దీంతో చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. రాయల్స్‌ టీమ్‌లో హెట్మెయర్ సూపర్‌ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. 5 సిక్సర్లు, ఓ బౌండరీతో చెలరేగిపోయాడు. పడిక్కల్‌ 29 పరుగులు చేయగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ 28 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌గా మధ్యలోనే క్రీజును వదిలిపెట్టాడు.

ఆ తర్వాత 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో టీమ్‌ని రాజస్తాన్‌ బౌలర్లు బోల్తా కొట్టించారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌లో ఓపెనర్‌ డికాక్‌ 39 పరుగులు చేసి రాణించాడు. చివర్లో స్టొయినిస్‌ 38 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివర్లో రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో అటు ఒత్తిడికి గురైన లక్నో బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. దీంతో 162 పరుగులకే పరిమితం కావడంతో 3 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపొందింది. యుజ్వేంద్ర చాహల్‌ నాలుగు వికెట్లు తీసుకుని రాజస్తాన్‌ విజయంలో కీ రోల్‌ పోశించాడు.

ఇక మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్‌ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 215 పరుగులు చేసింది. ఢిల్లీ టీమ్‌లో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అటు పృథ్వీ షా కూడా 51 పరుగులతో రాణించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 29, రిషబ్‌ పంత్‌ 27 పరుగులు చేయడంతో 216 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా ముందుంచింది ఢిల్లీ క్యాపిటల్స్‌.

అయితే భారీ లక్ష్యాన్ని చేధించడంతో విఫలమైంది కోల్‌కతా టీమ్‌. 171 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా టీమ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ 54 పరుగులతో రాణించాడు. నితీష్‌ రాణా 30, ఆండ్రు రస్సెల్‌ 24 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో 19.4 ఓవర్లలోనే ఆలౌటైంది కోల్‌కతా టీమ్‌. దీంతో 44 పరుగులతో గెలుపొందింది ఢిల్లీ క్యాపిటల్స్‌. ఈ గెలుపుతో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఢిల్లీ.

Also Read: RR vs LSG: మెరుపు ఇన్సింగ్స్ ఆడిన హెట్మెయర్‌.. 4 వికెట్లతో సత్తా చాటిన చాహల్..

KKR vs DC IPL Match Result: టాస్ ఓడినా అదరగొట్టిన ఢిల్లీ.. కోల్‌కతాపై 44 పరుగుల తేడాతో ఘన విజయం..