13 మ్యాచ్‌ల్లో 393 పరుగులు.. 161 స్ట్రైక్ రేట్‌తో బౌండరీల వర్షం.. ఈ హైదరాబాదీ ప్లేయర్‌కు చోటు దక్కేనా!

|

May 18, 2022 | 1:09 PM

ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. ప్రతీ సీజన్‌లాగే ఈ ఏడాది టోర్నమెంట్‌లో కూడా పలువురు డొమెస్టిక్ క్రికెటర్లు తమ అసాధారణ ప్రతిభను వెలికితీశారు.

13 మ్యాచ్‌ల్లో 393 పరుగులు.. 161 స్ట్రైక్ రేట్‌తో బౌండరీల వర్షం.. ఈ హైదరాబాదీ ప్లేయర్‌కు చోటు దక్కేనా!
Rahul Tripathi
Follow us on

ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. ప్రతీ సీజన్‌లాగే ఈ ఏడాది టోర్నమెంట్‌లో కూడా పలువురు డొమెస్టిక్ క్రికెటర్లు తమ అసాధారణ ప్రతిభను వెలికితీశారు. ఆ లిస్టులో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లు ఉండగా.. వీరితో పాటు గత రెండు-మూడు సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తోన్న రాహుల్ త్రిపాఠి ఈసారైనా జాతీయ జట్టులో చోటు సంపాదిస్తాడా అనే చర్చ కొనసాగుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ ఏడాది బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి.. మిడిల్ ఆర్డర్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాదు.. జట్టుకు పలు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ త్రిపాఠిని హైదరాబాద్ రూ.8.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వరుస సీజన్లలో తన అసాధారణ ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఈ సీజన్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు. దీనితో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు రాహుల్ త్రిపాఠి ఎంపికవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లలో 393 పరుగులు చేశాడు, ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 161.72 కాగా సగటు 39. మొత్తంగా 19 సిక్స్‌లు, 39 ఫోర్లు బాదాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియాలో చోటు దక్కేనా.!

ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, KL రాహుల్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనబరచలేదు. రాహుల్ త్రిపాఠి అద్భుత ఆటతీరు ప్రదర్శించగా.. అతడు జాతీయ జట్టుకు ఎంపిక అవుతాడా లేదా అన్నది మే 22న తేలనుంది.