KKR vs PBKS: స్పెషల్ రికార్డ్‌కు చేరువలో గబ్బర్.. కేకేఆర్ మ్యాచ్‌లో అలా చేస్తే తొలి భారత ఆటగాడిగా గుర్తింపు?
IPL 2022: ఐపీఎల్ చివరి మూడు సీజన్లలో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2022 వేలంలో రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
IPL 2022: ఐపీఎల్ 2022 ఎనిమిదో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు ఢీకొట్టనున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ పగ్గాలు శ్రేయాస్ అయ్యర్ చేతిలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అభిమానుల కళ్లు పంజాబ్ కింగ్స్ అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్‌పైనే ఉంటాయి. టీ20 కెరీర్‌లో వెయ్యి ఫోర్లు పూర్తి చేయడానికి కేవలం ఎనిమిది ఫోర్ల దూరంలో శిఖర్ ధావన్ నిలిచాడు. నేటి మ్యాచ్‌లో శిఖర్ ఎనిమిది ఫోర్లు బాదితే.. ప్రపంచంలో వెయ్యి ఫోర్లు బాదిన నాలుగో, తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.
T20లో అత్యధిక ఫోర్లు –
క్రిస్ గేల్ – 1132
అలెక్స్ హేల్స్ – 1054
డేవిడ్ వార్నర్ – 1005
టీ20లో అత్యధిక ఫోర్లు కొట్టిన భారత ఆటగాళ్లు-
శిఖర్ ధావన్ – 992
విరాట్ కోహ్లీ – 917
రోహిత్ శర్మ – 875
సురేష్ రైనా – 779
గౌతమ్ గంభీర్ – 747
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (5,827) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధావన్ నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో 6000 పరుగులు పూర్తి చేయడం ద్వారా విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.
ఎడమచేతి వాటం ఓపెనర్ అయిన ధావన్ IPL చివరి మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2022 వేలంలో రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇరు జట్ల ప్లేయింగ్ XI అంచనా:
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, సునీల్ నరైన్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్ అంగద్ బావా, షారూఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చాహర్.