Punjab Kings IPL 2022: 14 ఏళ్లలో కేవలం 2 ప్లేఆఫ్‌లు.. ట్రోఫీ కోసం నిరీక్షణ.. పంజాబ్‌ రాతను మయాంక్ మార్చేనా?

|

Mar 22, 2022 | 9:06 AM

Punjab Kings IPL 2022 Preview: మొదటి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కానీ అప్పటి నుంచి వారు తమ సత్తాను చూపించడంలో విఫలమవుతూనే ఉన్నారు.

Punjab Kings IPL 2022: 14 ఏళ్లలో కేవలం 2 ప్లేఆఫ్‌లు.. ట్రోఫీ కోసం నిరీక్షణ.. పంజాబ్‌ రాతను మయాంక్ మార్చేనా?
Ipl 2022 Punjab Kings
Follow us on

ఐపీఎల్ 2022 (IPL 2022)లో, పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు కొత్త రూపం, సరికొత్త సారథి మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) తో బరిలోకి దిగనుంది. టోర్నీలో 14 సీజన్లలో ఈ జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకోగలిగింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన టైంలో పంజాబ్ కింగ్స్ పేరు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌గా ఉండేది. ఆ తర్వాత ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. మరలా 2014లో జార్జ్ బెయిలీ సారథ్యంలో పంజాబ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆటలో నిలకడలేమి ఈ జట్టుకు చాలా నష్టం చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక కెప్టెన్లను పంజాబ్ కింగ్స్ మార్చింది. టైటిల్ సక్సెస్ కాకపోవడం వల్ల టీమ్ నిర్ణయాల విషయంలో చాలా మార్పలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

2018 నుంచి పంజాబ్ కింగ్స్ ఆర్. అశ్విన్, కేఎల్ రాహుల్ నాయకత్వంలో మంచి ప్రదర్శన చేసింది. కానీ, ప్లేఆఫ్‌ల విషయంలో మాత్రం వెనుకంజలోనే నిలిచేది. ఈ సమయంలో, జట్టు కొన్ని మ్యాచ్‌లలో చాలా అద్భుతమైన ఆటను కనబరిచింది. కొన్నింటిలో చాలా తేలికపాటి ప్రదర్శన చేసింది. ప్రస్తుతం IPL 2022లో జట్టు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. IPL 2022 వేలంలో అద్భుతమైన ఆటగాళ్లను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇటువంటి పరిస్థితిలో పంజాబ్ కింగ్స్ అభిమానులు ఈసారి విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు.

బ్యాటింగ్‌లో దుమ్మురేపే ప్లేయర్స్ పంజాబ్ సొంతం..

ఈసారి బ్యాటింగ్‌లో పంజాబ్‌కు పవర్‌ ఎక్కువగా ఉంది. శిఖర్ ధావన్‌తో మయాంక్ అగర్వాల్ చక్కటి ఓపెనింగ్ జోడీ కుదిరింది. గత కొన్ని సీజన్లలో ఇద్దరూ మంచి ఆటతీరును ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితిలో, ఓపెనింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, షారుక్ ఖాన్, భానుకా రాజపక్స రూపంలో బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో వీరు గేమ్ రూపాన్ని మార్చగలరని భావిస్తున్నారు.

ఆలౌ రౌండర్లలో తగ్గేదేలే..

ఈసారి ఆల్‌రౌండ్ విభాగంలో పంజాబ్‌కు మంచి ఎంపికలు ఉన్నాయి. అందరి దృష్టి ఓడియన్ స్మిత్ పైనే ఉంటుంది. అతడితో పాటు ఇటీవలి కాలంలో ప్రేరక్ మన్కడ్, రిషి ధావన్ ఫామ్ బాగుంది. బౌలింగ్ విభాగంలో, కగిసో రబాడ రూపంలో జట్టుకు విజయవంతమైన, ప్రకాశవంతమైన పేరు ఉంది. సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్ కీలక పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్పిన్‌లో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌లపైనే ప్రధాన దృష్టి ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ బలహీనత..

బ్యాటింగ్‌లో ధావన్, మయాంక్, షారుఖ్ కాకుండా పంజాబ్‌కు అదనపు బలం చేకూరింది. అందువల్ల బ్యాటింగ్‌లో లోపాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ప్రేరక్ మన్కడ్ ఆప్షన్‌లుగా మిగిలిపోనున్నారు. పేస్ బౌలింగ్‌లో రబాడ తప్ప నమ్మదగిన విదేశీ పేరు లేదు. ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ ఎల్లిస్ భారత పిచ్‌లపై అతని ఉపయోగం అని ఇంకా నిరూపించుకోలేదు. అటు పేస్‌తోపాటు స్పిన్ విభాగం కూడా బలహీనంగా కనిపిస్తోంది.

పంజాబ్ కింగ్స్ ప్రత్యేకత..

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా ఉండటం విశేషం. అతను గత కొన్ని సీజన్‌లుగా జట్టులో భాగంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను జట్టు బలాలు, బలహీనతలను తెలుసుకునేందుకు చక్కని అవకాశం ఉంది. శిఖర్ ధావన్ రాకతో పంజాబ్ కూడా పటిష్టంగా మారింది. ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. షారుక్ ఖాన్ IPL 2022 సీజన్‌లో అద్భుత ప్లేయర్‌గా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది.

పంజాబ్ కింగ్స్ IPL 2022 స్క్వాడ్..

మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, ఇషాన్ పోరెల్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, సందీప్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, బెన్నీ తైడే, అథర్వ తైడే , అన్ష్ పటేల్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ బావా, రిషి ధావన్, షారూఖ్ ఖాన్, హృతిక్ ఛటర్జీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.

పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్
అనిల్ కుంబ్లే (హెడ్ కోచ్), జూలియన్ వుడ్ (బ్యాటింగ్ కన్సల్టెంట్), డామియన్ రైట్ (బౌలింగ్ కోచ్).

 

సంవత్సరం టోర్నమెంట్‌లో పంజాబ్ కింగ్స్ స్థానం
2008 సెమీఫైనలిస్ట్
2009 ఐదవ
2010 ఎనిమిదవ
2011 ఐదవ
2012 ఆరవ
2013 ఆరవ
2014 ఫైనల్లో ఓటమి
2015 ఎనిమిదవ
2016 ఎనిమిదవ
2017 ఐదవ
2018 ఏడవ
2019 ఆరవ
2020 ఆరవ
2021 ఆరవ

Also Read: IPL 2022: జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్ ఇప్పుడు లక్నో జట్టులో కీలకం.. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు..!

Watch Video: ఇలా బాదితే మరోసారి ట్రోఫీ మీదే.. బేబీ డివిలియర్స్, పొలార్డ్ బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో