PBKS vs SRH Score: రాణించిన బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన పంజాబ్.. హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..
Punjab Kings vs Sunrisers Hyderabad Score: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన 28వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన పంజాబ్...
Punjab Kings vs Sunrisers Hyderabad Score: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన 28వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన పంజాబ్ అలవుట్ అయ్యింది. హైదరాబాద్ గెలవాలంటే 152 పరుగులు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే మ్యాచ్ మొదలైన కొద్ది క్షణాలకే పంజాబ్ వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో ఢీలా పడ్డా జట్టును లియామ్ లివింగ్‌స్టోన్ ఆదుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక లివింగ్‌స్టోన్‌కు తోడుగా నిలిచిన షారుఖ్ ఖాన్ కూడా మంచి ఆటతీరును కనబరిచాడు.
వీరిద్దరు జట్టు స్కోర్ పరుగులు పెట్టిస్తున్నారని అనుకుంటున్న సమయంలోనే భువనేశ్వర్ వీరి పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. 26 పరుగుల వద్ద షారుఖ్ ఖాన్ విలియమ్స్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 71 పరుగుల పాట్నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. తర్వాత కాసేపటికే లివింగ్‌స్టోన్ స్పీడ్‌కు భువనేశ్వర్ బ్రేక్‌లు వేశాడు. 33 బంతుల్లో 60 పరుగులు సాధించిన లివింగ్‌స్టోన్ విలియమ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటి వరకు జట్టు స్కోరు భారీ దిశగా వెళుతోందని అనుకుంటున్న సమయంలో లివింగ్‌స్టోన్ అవుట్ అయ్యాక పంజాబ్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టుకు తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.
ఇక పంజాబ్ బ్యాటింగ్ విషయానికొస్తే.. శిఖర్ దావన్ కేవలం 8 పరగుల వద్దే పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత ప్రభ సిమ్రాన్ సింగ్ (14), జానీ బెయిర్‌స్టో (12), జితేష్ శర్మ (11) పరుగులు చేసి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇక రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ సున్న పరుగులకు పరిమితం అవడం గమనార్హం. సన్‌రైజర్స్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లకుగాను 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. నటరాజన్, సుచిత్ చేరో వికెట్ పడగొట్టారు. మరి పంజాబ్ ఇచ్చిన ఈ లక్ష్యాన్ని చేధిస్తుందో చూడాలి.
Also Read: Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..
Viral Video; ఈ గుర్రానికి ఎలుక దొరికిందంటే అంతే..? వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!