PBKS vs SRH Match Highlights, IPL 2022: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్.. 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు..
Punjab Kings vs Sunrisers Hyderabad Highlights in telugu: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ సునాయాసంగా చేధించారు..
Punjab Kings vs Sunrisers Hyderabad Highlights in telugu: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ సునాయాసంగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో హైదరాబాద్ తన ఖాతాలో వరుసగా నాలుగో విజయాన్ని వేసుకుంది. మ్యాచ్‌లో చివర్లో ఐడెన్ మార్క్రామ్, పూరన్ భారీ షాట్స్‌తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించారు. హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐడెన్ మార్క్రామ్ (41), నికోలస్ పూరన్ (35) పరుగులతో అజేయంగా నిలిచారు.
ఇక అంతకుముందు రాహుల్ త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31) పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికొస్తే రాహుల్ చాహర్ 4 ఓవర్లకుగాను 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రబడా ఒక వికెట్ తీసుకున్నాడు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన పంజాబ్ అలవుట్ అయ్యింది. దీంతో మొన్నటి వరకు పాయింట్ల జాబితాలో 7వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ 4 స్థానంలోకి చేరింది.
Key Events
పంజాబ్ జట్టు బౌటింగ్‌లో పటిష్టంగా ఉంది. మయాంక్, ధావన్, లివింగ్ స్టోన్, జితేశ్, స్మిత్, షారుఖ్ ఖాన్‌ల ఫామ్‌లో ఉండడంతో పరుగుల వరదా ఖాయంగా కనిపిస్తోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్స్‌ను నమ్ముకుంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జన్సెన్ లతో కూడిన పేస్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది.
LIVE Cricket Score & Updates
-
హైదరాబాద్ ఘన విజయం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది హైదరాబాద్. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకొని వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
-
విజయానికి చేరువుతోన్న హైదరాబాద్..
పంజాబ్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే దిశగా హైదరాబాద్ అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ 17 ముగిసే సమయానికి 131 పరుగులు సాధించింది. విజయానికి ఇంకా 18 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్క్రామ్ (29), నికోలస్ పూరన్ (27) పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
-
100 పరుగులు దాటిన హైదరాబాద్ స్కోర్..
పంజాబ్ ఇచ్చిన 152 పరగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలోనే సన్‌రైజర్స్ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే 100 పరుగుల మార్క్‌ను దాటేసింది. సన్‌రైజర్స్ 15 ఓవర్లు ముగిసే సమయానికి పరుగుల 111 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ విజయానికి ఇంకా 30 బంతల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.
-
మూడో వికెట్ గాన్..
అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్న సమయంలో ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్ ఛాహర్ బౌలింగ్‌లో షారుఖ్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 56 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ పెంచే క్రమంలో దూకుడుగా ఆడిన రాహుల్ త్రిపాఠిని రాహుల్ చాహర్ పెవిలియణ్ బాటపట్టించాడు. షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లు ముగిసే సమయానికి 64 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ (21), ఐడెన్ మార్ర్కామ్ (01) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
-
-
మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్..
పంజాబ్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేన్ విలియమ్‌సన్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్ బౌలర్స్ కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు సాధించింది. హైదరాబాద్ విజయం సాధించాలంటే 152 పరుగులు చేయాల్సి ఉంది.
-
పంజాబ్ స్పీడ్‌కు బ్రేక్‌లు..
జట్టు స్కోరును పెంచే క్రమంలో దూకుడు మీదున్న లియామ్ లివింగ్‌స్టోన్ స్పీడ్‌కు సన్‌రైజర్స్ బ్రేక్‌లు వేసింది. 33 బంతుల్లో 60 పరుగులు సాధించిన లివింగ్‌స్టోన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో విలియమ్స్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
-
మరో వికెట్ కోల్పోయిన పంజాబ్..
పంజాబ్ కీలక వికెట్ కోల్పోయింది. స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించిన షారుఖ్ ఖాన్, లివింగ్‌స్టోన్‌ల పాట్నర్‌షిప్‌కు భువనేశ్వర్ బ్రేక్ వేశాడు. 26 పరుగుల స్కోర్ వద్ద షారుఖ్ ఖాన్ విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
హాఫ్ సెంచరీ పూర్తి..
పంజాబ్ స్కోర్ బోర్డ్‌ను ఉరుకులు పెట్టించే పనిలో పడ్డ లివింగ్ స్టోన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కూడా మంచి భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు. ఇలా వీరిద్దరి పాట్నర్‌షిప్ 42 బంతుల్లో 61 పరుగులు చేరుకుంది.
-
వంద దాటిన పంజాబ్ స్కోర్..
వరుస వికెట్లు కోల్పోయి ఢీలా పడ్డ జట్టును ఆదుకునే పనిలో పడ్డాడు లియామ్ లివింగ్‌స్టోన్. కేవలం 22 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డాడు. దీంతో పంజాబ్ స్కోర్ కూడా 100 పరుగుల మార్క్‌ను దాటేసింది.
-
నాలుగో వికెట్ కూడా..
పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. కేవలం 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. జితేష్ శర్మ కేవలం 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఉమ్రన్ మాలిక్ బౌలింగ్‌లో మాలిక్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
కొనసాగుతోన్న పంజాబ్ వికెట్ల పతనం..
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. 50 పరగులలోపే మూడో వికెట్‌ను కోల్పోయింది. జానీ బెయిస్టో 12 పరుగులు చేసి వెనుతిరిగాడు. సుచిత్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..
పంజాబ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్కోర్ బోర్డ్ కాస్త వేగం పెంచుతున్నాడనుకున్న సమయంలోనే ప్రభ సిమ్రాన్ సింగ్ అవుట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
పంజాబ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ పడింది. 10 పరుగలు వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చిన శిఖర్ దావన్ పెవిలియన్ బాట పట్టాడు. పంజాబ్ స్కోర్ మూడు ఓవర్లు ముగిసే సమయానికి పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో ప్రభ సిమ్రాన్ సింగ్ (4), జానీ బెయిర్‌స్టో (1) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
-
ఇరు జట్ల ప్లేయర్స్..
Punjab Kings : శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా
Sunrisers Hyderabad : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
-
టాస్ గెలిచిన హైదరాబాద్..
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. పిచ్ చేజింగ్ చేసే వారికి అనుకూలంగా ఉన్న కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి హైదరాబాద్ వ్యూహం ఏమేర ఫలిస్తుందో చూడాలి.
Published On - Apr 17,2022 2:45 PM