IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..

|

Jan 28, 2022 | 1:19 PM

IPL 2022: IPL 15వ సీజన్ ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. టోర్నమెంట్ ముంబైలోనే నిర్వహిస్తున్నారు.

IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..
Ipl 2022
Follow us on

IPL 2022: IPL 15వ సీజన్ ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. టోర్నమెంట్ ముంబైలోనే నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం జరిగిన బీసీసీఐ అధికారుల సమావేశంలో మార్చి 27 నుంచి ముంబైలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే. అయితే ఫిబ్రవరి 20న మాత్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఐపీఎల్‌ను నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా ఎంపిక కూడా ఉంది.

బీసీసీఐ వర్గాలు ది టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ “బోర్డు ప్రస్తుతం ముంబై వెలుపల ఆలోచించడం లేదు. కరోనా మూడో వేవ్‌ బలహీనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని భారత్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ఐపీఎల్ 2022 కోసం ఆటగాళ్ల మెగా వేలం ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది అని స్పష్టం చేశారు. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ముంబైలోని ఆ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ గ్రౌండ్‌లు వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియంలలో జరుగుతాయి. అంతే కాకుండా అవసరమైతే పుణెని కూడా వేదికగా మార్చుకునే అవకాశం ఉంది.

ముంబైలో మ్యాచ్ అంటే విమాన ప్రయాణం అవసరం లేదు

ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో IPL 2022 నిర్వహించడం వెనుక ఉన్న అతిపెద్ద సీక్రేట్ ఏంటంటే జట్లు విమానంలో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇది కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం కావచ్చు. అవసరమైతే బాంద్రా కుర్లా స్టేడియంను కూడా టీమ్‌ల శిక్షణ, ప్రాక్టీస్‌కు వినియోగిస్తారని నివేదిక పేర్కొంది. హోమ్ మ్యాచ్‌లు చాలా వరకు ఈ గ్రౌండ్‌లోనే జరుగుతాయి.

రంజీ ట్రోఫీని 2 దశల్లో నిర్వహించడంపై దృష్టి

గురువారం జరిగిన బీసీసీఐ అధికారుల సమావేశంలో ఐపీఎల్ 2022తో పాటు రెండు దశల్లో రంజీ ట్రోఫీ నిర్వహణపై చర్చ జరిగింది. వీటిలో మొదటి దశ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఆడనుంది. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత జూన్, జూలైలో రెండో దశ ఆడుతుంది. బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ రంజీ ట్రోఫీని ట్రాక్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాడు. టోర్నమెంట్ ప్రారంభానికి 10 రోజుల ముందు జనవరి 4న కరోనా కారణంగా బీసీసీఐ రంజీ ట్రోపి వాయిదా వేసింది. దీంతో పాటు సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టీ20 లీగ్‌లు కూడా వాయిదా పడిని విషయం తెలిసిందే.

వామ్మో ఆ సీటు అస్సలే వద్దు.. లోక్‌సభలో జడుసుకున్న ఎంపీలు..?

చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?

SSC JE Result 2019: SSC జూనియర్ ఇంజనీర్ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేసుకోండి..?