MI vs PBKS IPL 2022: మయాంక్‌, ధావన్‌ల బీస్ట్‌ మోడ్‌ ఆన్‌.. ముంబై ముందు భారీ లక్ష్యం..

Mumbai Indians vs Punjab Kings Score: పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (52), శిఖర్‌ ధావన్‌ (70)లు అదరగొట్టడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ భారీస్కోరు సాధించింది.

MI vs PBKS IPL 2022: మయాంక్‌, ధావన్‌ల బీస్ట్‌ మోడ్‌ ఆన్‌.. ముంబై ముందు భారీ లక్ష్యం..
Mi Vs Pbks
Follow us

|

Updated on: Apr 13, 2022 | 10:08 PM

Mumbai Indians vs Punjab Kings Score: పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (52), శిఖర్‌ ధావన్‌ (70)లు అదరగొట్టడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ భారీస్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 198 రన్స్‌ సాధించి రోహిత్‌ సేన ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్‌, ధావన్‌ శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ముఖ్యంగా మయాంక్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 52 పరుగులు చేశాడు. ధావన్‌ ( 50 బంతుల్లో 70) కూడా ధాటిగా ఆడాడు. భారీషాట్‌ ఆడే యత్నంలో 97 పరుగుల వద్ద మయాంక్‌ ఔటౌనా ధావన్‌ తన ధాటిని కొనసాగించాడు. ఆతర్వాత వచ్చిన జాని బెయిర్‌స్టో (12), లివింగ్‌ స్టోన్‌ (2) నిరాశ పర్చినా జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 30 ) మెరుపులు మెరిపించాడు. షారుక్‌ (15) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో బాసిల్‌ థంపి (47/2), జస్‌ప్రీత్ బుమ్రా (28/1), జైదేవ్‌ ఉనాద్కత్‌ (44/1) రాణించారు. మురుగన్‌ అశ్విన్‌ (34/1) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

Also Read:MI vs PBKS Live Score, IPL 2022 : ధాటిగా ఆడుతోన్న పంజాబ్.. స్కోరెంతంటే..

బరువు తగ్గడానికి ఓట్స్ ను ఇలా తీసుకోండి..

TS Govt Jobs 2022: పోలీస్‌ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 3 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు